MD Sajjanar: ఉచిత బస్సుల్లో ఇబ్బందులా? సజ్జనార్ గుడ్ న్యూస్..

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిపై ఎండీ సజ్జనార్ స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిపై ఎండీ సజ్జనార్ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో కీలకమైన హామీ అనే చెప్పుకోవాలి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం రెండ్రోజుల్లోనే మహాలక్ష్మీ పథకంలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర మహిళలు అందరూ తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రాయాణికులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులపై ఎండీ సజ్జనార్ దృష్టి సారించారు. ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గించే దిశగా చర్యలు కూడా చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సిటీల్లోనే కాకుండా.. పల్లెటూర్లలో కూడా మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఊర్లలో పరిస్థితి అంత ఇంబ్బందికరంగా ఏమీ లేదు. కానీ, భాగ్యనగరంలో మాత్రం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్న మాట వాస్తవమే. గతంలో అంటే వివిధ రవాణా సౌకర్యాలను వినిగియోగించుకునే మహిళలు ఇప్పుడు దాదాపుగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం వల్ల టీఎస్ఆర్టీసీకి కూడా ఆదాయం పెరిగింది. అయితే ప్రాయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం అయితే ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఈ విషయంపై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

“ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకర రీతిలో ప్రాయాణం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. 4 నుంచి 5 నెలల్లో టీఎస్ఆర్టీసీ దాదాపు 2,050 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా 1,050 డీజిల్ బస్సులు.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాబోతున్నాం. ఈ 2,050 కొత్త బస్సులు విడతల వారీగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి” అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. నిజానికి ఇది ఆర్టీసీ ప్రయాణికులకు ఎంతో మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సర్వీసు తీసుకురావడంతో అందరూ ఆర్టీసీలోనే ప్రయాణం చేస్తున్నారు. తద్వారా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాం. ఇలా కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఆ రద్దీ కచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్త బస్సులను రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల ప్రాయాణికులకు ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే తప్పకుండా వారి వద్ద ఐడీ కార్డు ఉండాలి. అలా ఐడీ కార్డు లేని పక్షంలో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సిందే. ఒకవేళ ఐడీ తమతో లేకుండా.. టికెట్ తీసుకోకపోతే రూ.500 ఫైన్ కూడా విధాస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరి.. టీఎస్ఆర్టీసీలోకి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అంటూ ఎండీ సజ్జనార్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments