iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు TSRTC శుభవార్త.. జూలై 31 వరకే ఛాన్స్‌!

  • Published Jul 24, 2023 | 1:50 PM Updated Updated Jul 24, 2023 | 1:50 PM
  • Published Jul 24, 2023 | 1:50 PMUpdated Jul 24, 2023 | 1:50 PM
నిరుద్యోగులకు TSRTC శుభవార్త.. జూలై 31 వరకే ఛాన్స్‌!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. స్వయం ఉపాధి కల్పించుకోవాలని ఆశిస్తున్న నిరుద్యోగులకు, విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఈ మేరకు సంబంధిత వివరాలను ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌కు విడుదల చేశారు. రెండు సంవత్సరాల కోర్స్ కాలవ్యవధితో.. 10, 8వ తరగతి క్వాలిఫికేషన్‌తో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 31 చివరితేది. మరి ఇంతకు ఏ ఏ కోర్సుల్లో అవకాశాలున్నాయి.. ఎక్కడ అందుబాటులో ఉన్నాయి వంటి వివరాలు..

అయితే ఈ అవకాశం అందరికి అందుబాటులో లేదు. కేవలం వరంగల్‌లోని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు. వరంగల్‌లోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తోన్న వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెండు సంవత్సరాల కోర్సుకు గాను.. 10,8 వతరగతి క్వాలిఫికేషన్‌తో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 31 వరకు అవకాశం కల్పించారు. ఈ కాలేజీలో మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు క్పలించనున్నారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఐటీఐ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి అని తెలుపుతున్నారు.

ఈ కోర్సుల్లో జాయిన అయిన అయిన వారికి.. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులు కూడా పాఠాలు బోధిస్తారు. అంతేకాక ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు.. వారు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిషిప్‌ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్‌ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించవచ్చు అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ అందించాలనే ఉద్దేశంతో టీఎస్‌ఆర్‌టీసీ ఈ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది.