ఉచిత ప్రయాణ ఎఫెక్ట్.. మహిళలకు సజ్జనార్ రిక్వెస్ట్.. అలా చేయకండంటూ

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడమే కాదు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. దీంతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడమే కాదు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. దీంతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చు.

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు రూ.10 లక్షల మేర భీమా సౌకర్యం. ఈ రెండు పథకాలు ఒకేసమయంలో ప్రారంభించారు. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా జీరో టికెట్ తో ప్రయాణించవొచ్చు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్ది భారీగా పెరిగిపోయింది. ప్రతి బస్టాండ్ లో మహిళలు కిట కిటలాడుతున్నారు. ఇది కొంతమందికి ఇబ్బంది కరంగా మారడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్య చేశారు. వివరాల్లోకి వెళితే..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇది ఒకటి. ఈ పథకం మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఫ్రీ బస్సు సౌకర్యం పట్ల మహిళలు సంతోషంలో ఉన్నా.. కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి చిన్నపనికి మహిళలు బస్సులు ఎక్కడంతో విద్యార్థులు, చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో ఎక్కడ చూసినా మహిళల రద్దీ పెరిగిపోయింది. అంతేకాదు తక్కువదూరం వెళ్లే మహిళలు కూడా ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వెళ్లడంతో దూర ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన మహిళలకు ఓ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేధికగా ‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి., తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు అసౌకర్యం కలుగుతుంది.. తక్కువ దూరం ప్రయాణించేవరు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా తాము ఉన్నచోటు బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు.. దాని వల్ల ప్రయాణ సమయం ఎక్కువ అవుతుంది. ఇకపై ఆర్టీసీ బస్సులు కేటాయించిన స్టేజీల్లోనే ఆగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి, తోటి ప్రయాణికులు సహకరించాల్సిందిగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments