Sajjanar: ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌.. వారి కోసం ప్రత్యేక బస్సులు.. సజ్జనార్‌ ప్రకటన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ సంస్థ ఆదాయం పెరిగింది. అలానే ఇబ్బుందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ సంస్థ ఆదాయం పెరిగింది. అలానే ఇబ్బుందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ హామీ అమలు ఫైల్‌ మీద తొలి సంతకం చేశారు. డిసెంబర్‌ 9 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణలోని మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది.

దీని వల్ల సంస్థకు ఆదాయం కూడా భారీగానే వస్తుంది అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మగవాళ్లు, విద్యార్థులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ముఖ్యంగా దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తమకోసం ప్రత్యేక బస్సులు నడపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను పరిగణలోకి తీసుకున్న టీఎస్ఆర్టీసీ.. వాళ్ల కోసం ప్రత్యేక బస్సులు నడపాలన్న ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.

హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సజ్జనార్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోనే సుమారు 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని సజ్జనార్‌ తెలిపారు.

అంతేకాక ఉచిత ప్రయాణం కారణంగా దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నామని.. అప్పుడు ఈ ఇబ్బందులు కొంత వరకు తగ్గుతాయన్నారు.

అవసరమైతే దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాక ఆర్టీసీ అనౌన్స్‌మెంట్‌, ఎంక్వయిరీ రూం ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్‌ హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ చేసిన ప్రకటనపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments