Dharani
కండెక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ అండగా నిలిచింది. సంస్థ ఎండీ సజ్జనార్ వారి కుటుంబానికి 40 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఆ వివరాలు..
కండెక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ అండగా నిలిచింది. సంస్థ ఎండీ సజ్జనార్ వారి కుటుంబానికి 40 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఆ వివరాలు..
Dharani
ప్రయాణికులను ఆకట్టుకునేలా రకరకాల ఆఫర్లు పెట్టి.. ఆదాయాన్ని పెంచే విషయంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ముందుంటారు. అలానే తమ సిబ్బందికి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా అలానే ముందుకు వస్తారు. గతంలో కూడా ఈ కోవకు చెందిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు ఆర్టీసీ అధికారులు. కండక్టర్ కుటుంబానికి అండగా నిలిబడటమే కాక.. బ్యాంక్ ద్వారా 40 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని అందేలా చేసి.. సిబ్బందికి తామెప్పుడు తోడుగా ఉంటామని భరోసా కలిగించారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఈ చెక్కును కండక్టర్ కుటుంబానికి అందజేశారు. ఆ వివరాలు…
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్‌టీసీ సంస్థ అండగా నిలిచింది. పెద్ద దిక్కును కోల్పోయి.. దిక్కు తోచని స్థితిలో ఉన్న సదరు కండక్టర్ కుటుంబానికి 40 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో ఈ సాయం అందించి.. బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి ఈసాయం అందించారు. గురువారం హైదరాబాద్ బస్ భవన్‌లో యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. కండక్టర్ కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును అందించారు.
తాండూరు డిపోకు చెందిన కండక్టర్ లక్ష్మణ్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఆర్టీసీ సిబ్బంది శిక్షణకు సంబంధించిన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో.. లక్ష్మణ్ మృతి చెందారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గత ఏడాది జూన్ 22న ఈ ప్రమాదం జరిగింది. ఈ ఆపద సమయంలో సదరు కండక్టర్ తీసుకున్న యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40 లక్షల వరకు యూబీఐ అందజేస్తోంది.
రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించిని యూబీఐకి.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది, కండక్టర్ లక్ష్మణ్ భార్య జ్యోతి, కుమారుడు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చెక్కు అందజేత కార్యక్రమంలో సంస్థ ఈడీ ఎస్.కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.