iDreamPost

ఆ పేరుతో వచ్చే కాల్స్ అస్సలు నమ్మోద్దు.. ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి..!

TSRTC MD Sajjanar Alerts: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది నేరాల సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు దొంగలు ఇళ్లల్లోకి వెళ్లి కన్నాలు వేసేవారు.. కానీ ఇప్పుడు కూర్చున్న చోట ఉంటూనే జనాలకు టెక్నాలజీతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

TSRTC MD Sajjanar Alerts: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది నేరాల సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు దొంగలు ఇళ్లల్లోకి వెళ్లి కన్నాలు వేసేవారు.. కానీ ఇప్పుడు కూర్చున్న చోట ఉంటూనే జనాలకు టెక్నాలజీతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఆ పేరుతో వచ్చే కాల్స్  అస్సలు నమ్మోద్దు.. ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి..!

ఒకప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండి నేరస్తులను గజ గజలాడించిన వీసీ సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన మార్క్ చూపిస్తారు. ఒకప్పుడు కష్టాల బాటలో ఉన్న టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులతో మమేకం అవుతూ.. వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. కొత్త కొత్త స్కీములు అమలు చేస్తున్నారు.. అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సజ్జనార్ వచ్చిన తర్వాత టీఎస్ఆర్టీసీలో పెను మార్పులు వచ్చాయని అంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ళు కొత్త పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ సూచించారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు సంపాదించడానికి కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మాయ మాటలు చెప్పి నమ్మించడం.. అవసరమైతే బెదిరించడం ఇలా ఎన్నో రకాల నేరాలకు తెగబడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా? ఎన్ని అవగాహన సదస్సులు పెడుతున్నా నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఇలా రక రకాల మార్గాల్లో సైబర్ నేరగాళ్ళు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఫేడ్ ఎక్స కొరియర్ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ అందినంత దోచుకుంటున్నారు.

ఇలాంటి నేరాలకు పాల్పపడే వారి గురించి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేరు తో జరిగే మోసాలకు బలి కావొద్దు.. చాలా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అసలు ఫెడెక్స్ మోసం అంటే ఏమిటి? ఎలా సాగుతుంది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా నేరస్థులు ఫెడెక్స్ కొరియర్ నుంచి మీ ఆధార్ నెంబర్ తో పార్సిల్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని.. వాటిని అక్రమంగా తరలిస్తున్నారా? అంటూ బెదిరిస్తాడు. దాంతో అమాయక ప్రజలు భయపడిపోతారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేయడం చట్టరిత్యా నేరం.. పెద్ద శిక్ష పడుతుందని బాధితుడిని భయపెడతారు.లక్ష రూపాయలు ఇస్తే మీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా చేస్తామని డిమాండ్ చేస్తాడు. దాంతో భయపడిపోయిన కొంతమంద వారు అడిగినంత డబ్బు చెల్లిస్తారు.ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలా మంది బలి అయ్యారని.. ఫెడెక్స్ పార్సిల్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ నమ్మవొద్దని ఎండీ సజ్జనార్ తెలిపారు. మీకు ఎలాంటి కాల్స్ పై అనుమానం వచ్చినా వెంటనే 1930 నబర్ కి కాలా చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి