Venkateswarlu
Venkateswarlu
రక్షా బంధన్‌ను పురస్కరించుకుని టీఎస్‌ఆర్‌టీసీ మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లక్కీ డిప్‌లో గెలిచిన మహిళలకు దాదాపు 5 లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులు ఇవ్వనుంది. రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఆగస్టు 30, 31వ తేదీల్లో మాత్రమే ఈ లక్కీ డిప్ నిర్వహించబడుతుంది. అది కూడా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మాత్రమే ఈ లక్కీ డిప్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతీ రీజియన్ పరిధిలో ముగ్గురి చొప్పున మొత్తం 33 మంది విజేతలను ఎంపిక చేయనున్నారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నారు.
ప్రయాణం పూర్తైన తర్వాత టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. వివరాలు రాసిన తర్వాత వాటిని దగ్గరలోని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. రెండు రోజుల తర్వాత ఆ డ్రాప్ బాక్సులను ఓ చోటుకు చేరుస్తారు. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా తీస్తారు. అధికారులు ప్రతీ రీజియన్‌లో ముగ్గురి చొప్పున విజేతలను ఎంపిక చేస్తారు. వారికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా విలువైన బహుమతులను అందించనున్నారు. దాదాపు 5.50 లక్షల రూపాయల బహుమతులు అందించనున్నారు.
దీనిపై టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు మాట్లాడుతూ.. మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఈ అద్భుతమైన పండుగ రోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రా నిర్వహించాలని భావించామన్నారు. సెప్టెంబర్ 9 లోగా లక్కీ డ్రా విజేతలకు బహుమతలు అందజేయటం జరుగుతుందని వెల్లడించారు. మరి, మహిళల కోసం టీఎస్‌ఆర్‌టీసీ లక్కీ డిప్‌ను ఏర్పాటు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.