iDreamPost

మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్త.. స్పెషల్ బస్సు ఏర్పాటు!

మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్త.. స్పెషల్ బస్సు ఏర్పాటు!

తెలంగాణలో పోలీస్ శాకలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ కూడా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నో కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకువస్తూ ఆర్టీసీని లాభాల బాటలో నడిచేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసిని ప్రజలకు మరింత చేరువ అయ్యేలే పలు స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు. పండగలు, ప్రత్యేక రోజుల్లో ప్రయాణికులకు రాయితీ కల్పిస్తున్నారు. ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయని అంటున్నారు. తాజాగా మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మహిళల కోసం టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త తెలిపింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ఓ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిందని.. చార్మినార్ నుంచి గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ ప్రత్యేక బస్సును నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్ బుధవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు ఎండీ సజ్జనార్. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 8.25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాల్ నగర్, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట్, లక్డీకాపుల్, అఫ్జల్ గంజ్, గాంధీ భవన్ మీదుగా చార్మినార్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5.20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి మైసమ్మ టెంపుల్ కి బయలుదేరుతుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ బస్సు సర్వీసు మహిళా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇక మొన్న జరిగిన పాక్ మ్యాచ్ ని ఉద్దేశించి మరో ట్విట్ చేశారు ఎండీ సజ్జనార్. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో ఆయన తెలిపారు. ఇది ఎక్కడైనా వర్తిస్తుందని అన్నారు. రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ఒక కవచం లాంటిది అని.. అది ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ప్రమాదాలను కోని తెచ్చుకుంటారని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి