iDreamPost
android-app
ios-app

Free Bus Journey: మహిళలకు ఫ్రీ జర్నీ.. పెరిగిన రద్దీ.. TSRTC కీలక నిర్ణయం

  • Published Dec 11, 2023 | 10:27 AM Updated Updated Dec 11, 2023 | 10:27 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్లే.. అధికారంలోకి రాగానే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దాంతో రద్దీ పెరగడంతో.. టీఎస్ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్లే.. అధికారంలోకి రాగానే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దాంతో రద్దీ పెరగడంతో.. టీఎస్ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 11, 2023 | 10:27 AMUpdated Dec 11, 2023 | 10:27 AM
Free Bus Journey: మహిళలకు ఫ్రీ జర్నీ.. పెరిగిన రద్దీ.. TSRTC కీలక నిర్ణయం

తెలంగాణలో తమకు అధికారం ఇస్తే.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకార్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లోనూ మహాలక్ష్మీ పథకం కింద ఈ హామీని చేర్చింది. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే.. ఆ హామీని నెవరేర్చడానికి ముందడుగు వేసింది. తొలి సంతకం ఆ ఫైల్ మీదనే చేసింది. అలానే రెండు రోజుల నుంచి అనగా డిసెంబర్ 9 శనివారం మధ్యాహ్నం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. దీనిలో భాగంగా.. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణలోని మహిళలంతా రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పథకానికి మంచి ఆరదణ లభిస్తోంది.

ఆర్టీసీలో ఉచిత జర్నీ అమల్లోకి రావడంతో.. చాలా మంది మహిళలలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం(డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం(డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టికెట్ మెషన్ లో ‘జీరో టికెట్‌’ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చాక రోజుకు ఎంత మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణిస్తారు అనే సంఖ్యపై స్పష్టత వస్తుందని అంటున్నారు అధికారులు.

tsrtc take important decision

మిగతా రోజులతో పోలిస్తే సాధారణంగా సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇవాళ కార్తికమాసంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి హాలీడేస్ లేవని..విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవ క్షేత్రాలకు పెద్దసంఖ్యలో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

సాధారణ రోజుల్లో 31-32 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా.. సోమవారం ఆ సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇక ఉచిత జర్నీ, చివరి కార్తీక సోమవావర కావడంతో.. ఇవాళ మరో 10 శాతానికిపైగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు సరికొత్త వ్యూహాలపై దృష్టి పెడతామన్నారు.