P Krishna
Metro Train Model Seating in Buses: ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.. దీంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది.
Metro Train Model Seating in Buses: ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.. దీంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది.
P Krishna
ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలపై సమీక్షలు వేస్తున్నారు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లే సదుపాయం ఉంది. తెలంగాణకు చెందిన వారై ఉండి ఏదైనా ఐడీ చూపిస్తే బస్సులో కండెక్టర్ జీరో టికెట్ ఇస్తారు. ఈ టికెట్ ద్వారా ఎక్కడికైనా ప్రయాణించవొచ్చు. ఈ పథకం డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కాగా తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తుంది. ఒకప్పడు రాష్ట్రంలో 11 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తే.. మహాలక్ష్మి పథకం తర్వాత ప్రతిరోజూ 20 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళల ప్రయాణికుల రద్దీతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ సరొకొత్త ప్లాన్ కి సిద్దమైంది. బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి మెట్రో రైల్ తరహాలో సిటింగ్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. బస్సుల్లో కొన్ని సీట్లను తొలగిస్తే చాలా మందికి చోటు ఉంటుందని ఆర్టీసీ భావిస్తుంది. బస్సుల్లో మెట్రో ట్రైన్ మాదిరిగా ఇరువైపుల సిటింగ్ ఏర్పాటు చేస్తే చాలా మంది కూర్చొవడాని, నిలబడేందుకు వీలుగా ఉంటుందని ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల్లో సిటింగ్ మార్చేశారు. ఈ పద్దతిలో సిటి బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. మెట్రో తరహా సిటింగ్ ఏర్పాటు చస్తే 63 మంది ప్రయాణిస్తే.. వంద శాతం ఆక్యూపెన్సీ పెంచుకోవచ్చని భావిస్తుంది. మహాలక్ష్మి పథకం తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగి విద్యార్థులు, ఎంప్లాయిస్ ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటికి కొత్త పత్తి మంచి పరిష్కారం చూపిస్తామని భావిస్తున్నారు. మరి బస్సుల్లో మెట్రో సిటింగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.