iDreamPost
android-app
ios-app

గ్రూప్-2 పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల వివరాలు ఇవే?

TSPSC Group 2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. ఆగష్టులో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది.

TSPSC Group 2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. ఆగష్టులో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది.

గ్రూప్-2 పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల వివరాలు ఇవే?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తుంటాయి. వివిధ శాఖల్లో ఉండే పోస్టులను భర్తీ చేసేందుకు  ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటాయి. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్3, గ్రూప్ 4 వంటి పరీక్షలు రాష్ట్ర స్థాయిలో జరుగుతుంటాయి. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రూప్2 పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల కోరిక మేరకు ఈ గ్రూప్‌-2  పరీక్షలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఈ సానుకూల ప్రకటన చేసింది. శుక్రవారం టీఎస్ పీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. అదే విధంగా వాయిదా పడిన ఈ గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించనుంది. అయిదే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కొత్త తేదీలను త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది. వాస్తవానికి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం..ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.

ఇదే సమయంలో డీఎస్సీ పరీక్షలు కూడా ఉన్నాయి. దీంతో అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక అభ్యర్థలు చేసిన విజ్ఞప్తులపై  ప్రభుత్వ సానుకూలంగా స్పందిం.. ఈ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ లో వేసిన ఈ నోటిఫికేషన్ లో 783 పోస్టుల ఉన్నాయి. ఇప్పటికే పలు కారణాలుతో  పలుమార్లు వాయిదా పడ్డింది. ఈ పోస్టులకు 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు పెంచి,  పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.