Dharani
TS 10th Class 2024 Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TS 10th Class 2024 Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Dharani
పదో తరగతి ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభంలోనే పది, ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇక తెలంగాణలో ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు రాగా.. నేడు అనగా మంగళవారం, ఏప్రిల్ 30 నాడు తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఉదయం 11 గంటలకు పదో తరగతి 2024 ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఇక విద్యార్థులు రిజల్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. వీరంతా టెన్త్ ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు. తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనబడి వెబ్‌సైట్ నుంచి కూడా రిజల్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలకలేద పైచేయిగా ఉంది. పది ఫలితాల్లో అబ్బాయిలు 89.41శాతం.. అమ్మాయిలు 92శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు నమోదయ్యాయి. ఇక పదో తరగతి ఫలితాల్లో.. నిర్మల్ 99.06 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. వికారాబాద్ అత్యల్పంగా 66 శాతం ఫలితాలను సాధించినట్టు తెలిపారు. ఇక.. 8,883 మంది విద్యార్థులు 10జీపీఏ సాధించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఓవరాల్‌గా ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.
మరోవైపు తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కుల మెమోలపై పెన్ నెంబర్ ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ రెడీ అవుతోంది. ఫలితంగా 10వ తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. ఈ పెన్ నెంబర్ (సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది.