iDreamPost
android-app
ios-app

అన్నదాతలకు KCR సర్కార్‌ మరో తీపి కబురు.. త్వరలోనే నిర్ణయం!

  • Published Aug 04, 2023 | 6:09 PMUpdated Aug 04, 2023 | 6:41 PM
  • Published Aug 04, 2023 | 6:09 PMUpdated Aug 04, 2023 | 6:41 PM
అన్నదాతలకు KCR సర్కార్‌ మరో తీపి కబురు.. త్వరలోనే నిర్ణయం!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ఎకరాకు 5 వేల రూపాయలను రైతు బంధు కింద అందిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రైతు బీమా కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇవే కాక విపత్తుల సమయంలో అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నారు సీఎం కేసీఆర్‌. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. ఈమేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఆ వివరాఉల..

తెలంగాణ అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు వినిపించేందుకు సిద్ధమవుతోంది అని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.. రాష్ట్రంలో ప్రత్యేక పంట బీమాను ప్రతిష్టాత్మంకంగా అమలు చేయాలన్న దిశగా.. ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఈమధ్య కాలంలో సంభవించిన వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంని కోరారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రి నిరంజన్ రెడ్డి సవివరమైన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకం.. ప్రారంభంలో చాలా ఆకర్షనీయంగా ఉంది. కానీ దాని అమలు సరిగా లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,415 కోట్ల రూపాయల ఇన్సురెన్స్ మొత్తం కడితే.. అన్నదాతలకు వచ్చింది మాత్రం కేవలం 1893 కోట్లేనని తెలిపారు. దీంతో.. కేవలం 4 సంవత్సరాలల్లో 5 వందల 20 కోట్లు ఇన్సురెన్స్ కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టినట్టైయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం వల్ల మనకు నష్టం జరుగుతుండటంతో.. ఆ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చిందని నిరంజన్‌ రెడ్డి వివరించారు.

అయితే.. తెలంగాణ రాష్ట్రానికే ఒక సొంత ఇన్సురెన్స్ విధానం ఉంటే ఎలా ఉంటుంది.. ఒకవేళ ఉంటే అది ఎలా ఉండాలి.. వివిధ దేశాల్లో ఇన్సురెన్స్ విధానాలు ఎలా ఉన్నాయి.. వాటిని వర్తింపజేసే సమయంలో మనం ఎలాంటి కొత్త ఆచరణాత్మక విధానాలు అవలంభించవచ్చు.. అన్న అంశాల మీద ప్రస్తుతం అధ్యాయనం చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే.. దీనిపై కసరత్తు చేస్తున్నామని.. భవిష్యత్తులో చాలా మంచి పథకం తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

అయితే.. గతంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పంటలతో సంబంధం లేకుండా.. ఎకరానికి పదివేల రూపాయల పరిహారం ఇస్తామన్న ఏకైక సీఎం.. కేసీఆర్‌ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకుగాను.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 151 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయటమే కాకుండా.. బాధిత రైతులకు పరిహారం మొత్తాన్ని ఇప్పటికే అందజేసినట్లు చెప్పుకొచ్చారు. మరో.. 160 కోట్ల నిధులు కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి