iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు సెలవు.. జీతం కట్‌ కాదు

  • Published Apr 25, 2024 | 9:13 AM Updated Updated Apr 25, 2024 | 9:13 AM

Loksabha Election 2024: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. ఆ వివరాలు..

Loksabha Election 2024: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 9:13 AMUpdated Apr 25, 2024 | 9:13 AM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు సెలవు.. జీతం కట్‌ కాదు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్‌ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. మే 13న పోలింగ్‌ జరుగుతుండగా.. జూన్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్‌ కమిషన్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎలక్షన్స్‌లో కీలకమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మిగిలిన వారు ఇవాళ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందిచనున్నారు. నేడు అనగా గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత కుదరదు. మిగిలిని అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు.

It is a day off for government employees

ఇక తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుండగా.. 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా, పోల్ చిటీలు పంపిణీ వంటి ఏర్పాట్లలో తలమునకలయ్యి ఉన్నారు. కాగా ఎన్నికల పోలీంగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్‌ కమిషన్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజు అనగా మే 13న వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇక ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.