iDreamPost
android-app
ios-app

TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ .. ఫెయిల్ కావడంతో విద్యార్థిని దారుణ నిర్ణయం

ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. తాజాగా తెలంగాణలో ఇంటర్ ఫలితాలను వెల్లడించింది బోర్డు. ఇలా ఫలితాలు వెలువడగానే.. పాస్ అయ్యామా, ఎన్ని మార్క్ వచ్చాయి అని చెక్ చేసుకుంటున్నారు విద్యార్థులు

ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. తాజాగా తెలంగాణలో ఇంటర్ ఫలితాలను వెల్లడించింది బోర్డు. ఇలా ఫలితాలు వెలువడగానే.. పాస్ అయ్యామా, ఎన్ని మార్క్ వచ్చాయి అని చెక్ చేసుకుంటున్నారు విద్యార్థులు

TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ .. ఫెయిల్ కావడంతో విద్యార్థిని దారుణ నిర్ణయం

విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కాదు. 10, 12 తరగతుల్లో ఫెయిల్ లేదా అత్తెసరు మార్కులు సాధించిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో లేదా ఉన్నతాధికారులుగా మారిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ కొంత మంది విద్యార్థులు.. మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు చెప్పలేమని, సమాజంలో తమను చూసే చిన్న చూపుకు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన కొంత మంది పేరెంట్స్ కూడా తమ పిల్లల విషయంలో రిజల్ట్స్ తేడా వస్తే.. చావకొడుతున్నారు. అందరి ముందు చులకన భావంతో మాట్లాడుతున్నారు. దీంతో మనో స్థాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఫలితాలు వస్తున్నాయంటే.. పిల్లల జీవితాలను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా ఫెయిలైన విద్యార్థులవి. పరీక్షల్లో ఫెయిల్ అయితే.. జీవితంలో కూడా ఫెయిల్యూర్ అని భావించి ప్రాణాలను తీసుకుంటున్నారు కొంత మంది స్టూడెంట్స్. తాజాగా తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది బోర్డు. ఏప్రిల్ 24న ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ ఓ అమ్మాయి పాలిట శాపమయ్యాయి. రిజల్ట్ రాగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తేజశ్విని తన మార్కులు చూసుకుంది. ఆమె ఫెయిల్ కావడంతో మన స్థాపానికి గురైంది. ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న బాధలో ఆత్మహత్య చేసుకుంది. కూతురు చనిపోవడంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది.

ఫలితాల సమయాల్లో  ఫెయిల్ అయిన విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురౌతున్నారు. ఈ సమయంలో  తల్లిదండ్రులు సపోర్టుగా నిలబడాలని వైద్యులు సూచిస్తున్నారు. వారిని మోటీవేట్ చేయడం, కాస్త కనిపెట్టుకుని ఉండటం, వారు పాజిటివ్ థింకింగ్ వైపు ఆలోచించేలా చేయాలని చెబుతున్నారు. కాగా, ఈ సారి కూడా అమ్మాయిలదే పై చేయి. మొత్తంగా  ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60.01 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 64.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, సెకండ్ ఇయర్‌లో 72.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అబ్బాయిలు విషయానికి వస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అబ్బాయిలు 51.50 శాతం,సెకండ్ ఇయర్ 56.01 శాతం ఫస్ల్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి తొలి స్థానంలో నిలువగా, సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా టాప్ స్థానంలో నిలిచింది.