Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాల భర్తీ?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. త్వరలోనే నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. త్వరలోనే నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ కేవలం 34 స్థానాలకే పరిమితం అయ్యింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కారు పార్టీని ఈ సారి జనాలు పక్కకు పెట్టారు. గులాబీ పార్టీ ఓటమిలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 పరీక్ష పేపర్ ను అమ్ముకోవడం.. పదుల సంఖ్యలో పేపర్లు లీక్ కావడం.. మిగతా నోటిఫికేషన్లలో వివాదాస్పద రూల్స్ పెట్టడం.. ఎన్ని జరిగినా.. టీఎస్పీఎస్సీ బోర్డు మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిరుద్యోగులకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో బాగా చూపించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా.. మిగతా సభ్యులు కూడా రాజీనామా చేశారు. అలానే జనవరి 6, 7న నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను మరోసారి రద్దు చేశారు. ఇక తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు… యూపీఎస్సీ సభ్యులను కలిసి.. పరీక్షల నిర్వహణ గురించి చర్చించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించాలని ఆ సంస్థ ఛైర్మన్ మనోజ్ సోనిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సోని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సాయం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారం లేదా.. నెలాఖరులోగా 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. తెలంగాణ నిరుద్యోగులు పండగ చేసుకుంటారు. ఇక త్వరలనే టీఎస్పీఎస్సీ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తామని వెల్లడించింది రేవంత్ సర్కార్. అలానే ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జాబ్ క్యాలెండర్ విడుదల, నియమాకాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Show comments