తెలంగాణ: న్యూ ఇయర్ వేడుకలు.. రికార్డు సృష్టించిన మందుబాబులు.. ఎన్ని కోట్లకు తాగారంటే

డిసెంబర్ 31 వస్తుంది అంటే.. మందుబాబులు వారం రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజు మద్యం ఏరులై పాలుతుంది. మరి ఈ ఏడాది మందుబాబులు ఎంత మందు తాగారు అంటే..

డిసెంబర్ 31 వస్తుంది అంటే.. మందుబాబులు వారం రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజు మద్యం ఏరులై పాలుతుంది. మరి ఈ ఏడాది మందుబాబులు ఎంత మందు తాగారు అంటే..

డిసెంబర్ 31, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం అమ్మకాలు.. ప్రతి ఏటా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది కూడా తెలంగాణలో మందు బాబులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోళ్లు చేశారు. ఒక్క రోజులోనే ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయల ఆదాయం అందజేశారు. పైగా డిసెంబర్ 31 నాడు అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచిందేకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇంకేముందు.. రాత్రంతా తాగుతూ ఎంజాయ్ చేశారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు..

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సరికొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు జనాలు. తెల్లవార్లూ వేడుకలు జరుపుకుంటూ.. కేక్ కట్ చేసి.. శుభాకాంక్షలు తెలుపుకుని.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇక మందుబాబులైతే న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెగ తాగారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. తమ జేబులు గుల్లచేసుకుని ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. మూడు రోజుల్లో రూ.658 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు తెరిచి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్‌ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,000 కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి.

ఇక రాత్రి 8 గంటలనుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా.. హైదరబాద్, సైబరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోనే భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొత్తం మూడు రోజులుగా 1241 కేసులు నమోదు చేశామని, అత్యధికంగా మియాపూర్‌లో 253 కేసులు నమోదైనట్లు సైబరాబాద్‌ అధికారులు వెల్లడించారు.

Show comments