తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లో నగదు జమ.. ఎందుకంటే

Rs 500 Cylinder Subsidy Money: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రజలకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

Rs 500 Cylinder Subsidy Money: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రజలకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలకు సంక్షేమ పాలన అందిచేందుకు రెడీ అయ్యింది. ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం వెంటనే అమలు చేశారు. ఆతర్వాత వంద రోజుల లోపు మిగతా హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. అలానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. జీరో కరెంట్‌ బిల్లు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇండ్ల పథకం వంటి స్కీమ్‌లను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. వారి ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకు ఇవి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అంటే..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. ఈ పథకం అమలు కోసం ఇప్ప‌టికే అర్హుల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం ఆయా కుటుంబాల‌కు రూ.500ల‌కే ఎల్పీజీ సిలిండ‌ర్‌ను అందిస్తోంది. అయితే ఈ పథకానికి అర్హులైన వారు ముందుగా సిలిండర్‌ ధర మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సీడీ మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ మీద 100 రూపాయల తగ్గించక మునుపు రాష్ట్రంలో సిలిండ‌ర్ ధ‌ర రూ.974 రూపాయ‌లు ఉంది.

ఇక 500లకే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారులు ముందుగా పూర్తి ధర అనగా 974 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం 500 రూపాయ‌లు పోనూ మిగ‌తా న‌గ‌దును ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేస్తోంది. అంటే ఒక్కో సిలిండ‌ర్‌పై రూ.426.62 స‌బ్సిడీని అందిస్తోంది. ఇక తాజాగా కేంద్ర‌ ప్ర‌భుత్వం ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై రూ.100 త‌గ్గింపును ప్ర‌క‌టించింది. ఇది అమ‌ల్లోకి రావ‌డంతో ప్రస్తుతం తెలంగాణ‌లో సిలిండర్ ధ‌ర రూ.850 చేరుకుంది. ఇక ఈ ప‌థ‌కానికి ఎవ‌రైనా అర్హులు ఉండి ఇంకా ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోతే మ‌రోసారి అప్లై చేసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు త‌మ‌త‌మ మండ‌ల కార్యాల‌యాల్లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరు గ్యారెంటీల ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవకాశం కల్పించింది.

Show comments