iDreamPost
android-app
ios-app

TSPSC చైర్మన్ రాజీనామా.. షాకిచ్చిన గవర్నర్ తమిళిసై

  • Published Dec 12, 2023 | 2:55 PM Updated Updated Dec 12, 2023 | 2:55 PM

టీఎస్‌పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా తెలంగణ గవర్నర్ ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..

టీఎస్‌పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా తెలంగణ గవర్నర్ ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 2:55 PMUpdated Dec 12, 2023 | 2:55 PM
TSPSC చైర్మన్ రాజీనామా.. షాకిచ్చిన గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజీనామాల పర్వం మొదలయ్యింది. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం టీఎస్సీపీఎస్సీ బోర్డు నిర్వహాణ, గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి.. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్, త్వరలో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించి అధికారులతో చర్చించి.. భవిష్యత్తు కార్యచరణ వెల్లడించనున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటి వరకు జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎంవో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈలోపే జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం.. సంచనలంగా మారింది. జనార్థన్ రెడ్డి సోమవారం నాడు.. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు పంపించారు.

 

అయితే ఈ రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తిరస్కరించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం (డిసెంబర్ 11న) సీఎం రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. అనంతరం కాసేపటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు రిజిగ్నేషన్ లెటర్ ని పంపించారు. అయితే గవర్నర్ కూడా జనార్థన్ రెడ్డి రాజీనామాకు ఆమోద ముద్ర వేశారని ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన రాజ్ భవన్ వర్గాలు జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని వెల్లడించాయి. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరిలో ఉన్నారని, జనార్దన్ రెడ్డి రాజీనామా గవర్నర్ పరిశీలనలోనే ఉందని స్పష్టం చేశాయి. అయితే పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ ఈ మేరకు గవర్నర్ డీవోపీటీకి లేఖను సైతం రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

గత ప్రభుత్వ హయంలో గ్రూప్ -1 సహా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రెడ్డి రాజీనామా చేయాలని అప్పట్లో ఆందోళనలు కూడా జరిగాయి. దాంతో అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్.. బోర్డును రద్దు చేసి.. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఆయన నిర్ణయంపై నిరుద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కొందరు నిరుద్యోగులు సంబరాలు కూడా చేసుకున్నారు. మరి టీఎస్‌పీఎస్సీ బోర్డు రద్దు, జాబ్ క్యాలెండర్, తదుపలి పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రానుంది.