iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు ఊరట.. TSPSC ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం..

  • Published Jan 10, 2024 | 7:24 PM Updated Updated Jan 10, 2024 | 7:24 PM

తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఆ వివరాలు..

తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఆ వివరాలు..

  • Published Jan 10, 2024 | 7:24 PMUpdated Jan 10, 2024 | 7:24 PM
నిరుద్యోగులకు ఊరట.. TSPSC ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం..

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కమిషన్ ఛైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి సహా, ఇతర సభ్యులు రాజీనామా చేయగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నేడు వాటికి ఆమోదముద్ర వేశారు. దాంతో కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అవ్వడమే కాక ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయ్యింది. తాజా పరిణామాలపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలయ్యింది. కారు పార్టీ ఓడిపోవడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు పరీక్షల పేపర్లు లీక్ కావటం.. ఫలితంగా కొన్ని రద్దవటం, మరికొన్ని వాయిదాలు పడటంతో నియామక ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని.. బోర్డునే మార్చేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ దీనిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోలేదు. దాంతో ఆగ్రహించిన నిరుద్యోగులు.. ఎన్నికల్లో అందుకు బదులు తీర్చుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి సహా మిగతా సభ్యులు కూడా రాజీనామా చేశారు. కమిషన్‌ రద్దుతో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణ మరోసారి వాయిదా పడింది. కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నా ఇబ్బంది తలెత్తింది. ఈక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సైతం ఛైర్మన్‌​, సభ్యుల రాజీనామాలకు త్వరగా ఆమోదం తెలపాలని గవర్నర్‌ని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా వారి రాజీనామాలను ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త కమిషన్ ఏర్పాటు, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లైంది. కమిషన్ ఏర్పాటు తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.