Dharani
మందు బాబులకు షాకింగ్ న్యూస్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది. మరి ఎందుకు ఈ నిర్ణయం అంటే..
మందు బాబులకు షాకింగ్ న్యూస్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది. మరి ఎందుకు ఈ నిర్ణయం అంటే..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. నేడు అనగా మంగళవారం సాయంత్ర 5 గంటలకు ఎలక్షన్ ప్రచార పర్వానికి తెర పడనుంది. ఈనెల 30న అనగా మరో రెండు రోజుల్లో గురువారం నాడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలానే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అలాంటి పాంత్రాల్లో భద్రతను పెంచారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మందు బాబులకు ఇది షాకింగ్ వార్త అని చెప్పవచ్చు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ నేపథ్యంలో నేటి నుంచి అనగా మంగళవారం నుంచి గురువారం వరకు అనగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్లు మూసివేయాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌కు రెండ్రోజల మందు నుంచే మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘించి మద్యం దుకాణాలు తెరిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేటితో ప్రచారానికి తెర పడనుంది. మైక్ లు మూగబోతాయి. ఇక రెండు రోజుల్లో ఓటర్లు నేతల భవితావ్యాన్ని ఈవీఎంలలో భద్రపర్చనున్నారు. డిసెంబర్ 3న లీడర్ల భవితవ్యం తేలనుంది. ఇక నేటి నుంచి తెర మీద కనిపించే ప్రచార పర్వానికి ముగింపు పలకనున్నారు. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తెర వెనుక ప్రలోభాలు మెుదలయ్యాయని తెలుస్తోంది.
ఇప్పటికే భారీగా మద్యం, డబ్బులు నియోజకవర్గాలకు చేరినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 1500 నుంచి రూ. 3 వేల వరకు ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ ఎత్తున మద్యం కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.