iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఎన్నికల వేళ.. రూ.520 కోట్లు విలువైన సొత్తు సీజ్‌

  • Published Nov 09, 2023 | 10:17 AMUpdated Nov 09, 2023 | 10:17 AM

తెలంగాణ ఎలక్షన్‌లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు సీజ్‌ చేశారు అధికారులు. ఆవివరాలు..

తెలంగాణ ఎలక్షన్‌లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు సీజ్‌ చేశారు అధికారులు. ఆవివరాలు..

  • Published Nov 09, 2023 | 10:17 AMUpdated Nov 09, 2023 | 10:17 AM
తెలంగాణ ఎన్నికల వేళ.. రూ.520 కోట్లు విలువైన సొత్తు సీజ్‌

మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని విపరీతంగా కృషి చేస్తున్నారు. ఇక ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం కొందరు నాయకులు విపరీతంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంచుతుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్‌ పెట్టడానికిక, ధన ప్రవాహాన్ని అడుకోవడం కోసం ఎన్నికల అధికారులతో పాటు.. పోలీసులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పదంగా కనబడిన నగదును, సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 520 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, వెండి వంటి లోహాలు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఓ చోట భారీ ఎత్తున నగదు, ఇతర విలువైన ఆభరణాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక ఈ సారి ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులే కాకుండా జీఎస్‌టీ, కస్టమ్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, అంతర్‌ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి.. నిత్యం పెద్ద మొత్తంలో నగదు, మద్యం, బంగారం, వెండి పట్టుబడుతూనే ఉన్నాయి.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి అనగా.. సుమారు 27 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు చేసిన తనిఖీల్లో నగదు, బంగారం, వెండి, మద్యం, ఇతర వస్తువులు కలిపి రూ.490.58 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశాయి. అక్టోబరు 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి దాకా స్వాధీన చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.520 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.

ఇలా పట్టుబడిన మొత్తంలో 173 కోట్ల రూపాలయ నగదు, 176 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు రూ. 52.51 కోట్లు విలువ చేసే కుక్కర్లు, చీరలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, క్రీడాసామగ్రి, ఇతర వస్తువులు . అలాగే రూ. 60.09 కోట్లు విలువ చేసే మద్యం, రూ. 28.61కోట్లు విలువైన గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం.. తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, నగలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికారులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక గతంతో పోలిస్తే.. ఈ సారి ఎన్నికల్లోనే భారీ ఎత్తున నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి