Dharani
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేటీఆర్.. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేటీఆర్.. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3 ఫలితాలు వెల్లడవుతాయి. ఈ క్రమంలో అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తమ సంక్షేమ పాలన గురించి వివరిస్తూనే ప్రతి పక్షాల మీద విమర్శలు చేస్తూ.. ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రచారం సందర్భంగా కేటీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారుతోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. తానేమి రష్మిక అంత ఫేమస్ కాదని చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఏం సందర్భంలో చేశారంటే..
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు స్పందించారు. రష్మికకు మద్దతుగా నిలిచారు. మంత్రి కేటీఆర్ కూడా ఆ వీడియోపై స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందని అలాంటివి మంచివి కావని అన్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ వివాదం స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
ఉమెన్‌ఆస్క్‌కేటీఆర్ పేరుతో హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘డీప్‌ఫేక్ మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే. ప్రత్యర్థులు ఈ టెక్నాలజీని వినియోగించి.. మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే నేను రష్మిక అంత ఫేమస్ కాదు.. అందుకే నాపై ఇప్పటి వరకు డీప్‌ఫేక్ వీడియో రాలేదని’’ ఫన్నీ కామెంట్స్ చేశారు కేటీఆర్.
ఇక ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచిందని తాను తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేటీఆర్. తన భార్య శైలిమ చాలా ఓపికగా ఉంటారని.. చెల్లి కవిత చాలా డైనమిక్ అంటూ ప్రశంసలు కురిపించారు. తమ కుటుంబంలో తన సోదరి కవిత అంత ధైర్యవంతులు ఎవరు లేరన్నారు. తన కుమార్తె చిన్నవయసులోనే చాలా బాగా ఆలోచిస్తోందని.. పిల్లలిద్దరినీ సమానంగా చూస్తానని చెప్పుకొచ్చారు. కుమార్తె పుట్టాక తన జీవితం చాలా మారిందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌ను మహిళలు సురక్షిత నగరంగా భావిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని.. దీనిపై బాధగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సంఖ్య పెరిగేలా చూస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.