Praja Bhavan: ప్రజాభవన్ లోకి అడుగు పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజాభవన్ గా పేరు మార్చిన ప్రగతి భవన్ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన గృహప్రవేశం చేశారు. ఆ వివరాలు..

ప్రజాభవన్ గా పేరు మార్చిన ప్రగతి భవన్ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన గృహప్రవేశం చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు శ్రీకారం చూడుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రజల సమస్యలు వినేందుకు.. ప్రగతి భవన్ లో ప్రజాదర్బారును ఏర్పాటు చేశారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికార నివాసంగా ప్రజా భవన్ ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం తన అధికారిక నివాసం ప్రజాభవన్‌లోకి ప్రవేశించారు.

భట్టి.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాభవన్ లో అడుగు పెట్టారు. ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేశారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా భవన్ లో గృహప్రవేశం సందర్భంగా హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆయన తన ఆఫీస్‌లో బాధ్యతల స్వీకరించడానికి సచివాలయం వెళ్లారు.

తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రగతి భవన్ లో ఉండేవాళ్లు. కానీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చడమే కాక దాన్ని డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చేసింది. ప్రస్తుతం ప్రగతి భవన్ ని భట్టికి కేటాయించడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటారనే చర్చ మొదలైంది. ఆయన అధికారిక నివాసం కోసం అన్వేషణ కొనసాగుతోంది.

దీనిలో భాగంగా అధికారులు తాజాగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని పరిశీలించారట. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండటం భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దాన్ని అధికారిక నివాసంగా ఉపయోగిస్తే అక్కడ శిక్షణ సంస్థను ప్రజాభవన్‌లో ఖాళీగా ఉన్న ప్రాంతాలకు మార్చే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే సీఎం అధికారిక నివాసానికి సంబంధింకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show comments