iDreamPost
android-app
ios-app

Mallu Bhatti Vikramarka: యాదాద్రిలో క్రింద కుర్చున్నాడని ట్రోలింగ్ పై భట్టి విక్రమార్క క్లారిటీ!

సోమవారం యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి చిన్న పీటపై కూర్చున్నారు. దీనిపై ట్రోల్స్ రావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

సోమవారం యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి చిన్న పీటపై కూర్చున్నారు. దీనిపై ట్రోల్స్ రావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

Mallu Bhatti Vikramarka: యాదాద్రిలో క్రింద కుర్చున్నాడని ట్రోలింగ్ పై భట్టి విక్రమార్క క్లారిటీ!

సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటో పెద్ద రచ్చ చేసింది. అందులో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చుని ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్  కావడంతో అనేక ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ఘటనపై స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

మంగళవారం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిర్వహించిన సింగరేణి అతిథి గృహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలానే యాదాద్రి ఘటనపై మంత్రి వివరణ ఇచ్చారు. యాదాద్రిలో తాము దిగిన ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. అయితే తనను ఎవరూ అవమానించలేదని ఆయన తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” నేను ఎవరికీ తలవంచే వ్యక్తిని కాదు. నేను ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ప్రణాళిక శాఖ మంత్రి వంటి కీలక శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాను. ఎవరో పక్కన కూర్చొబెడేత కూర్చునే వాడిని కాదు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు. అయితే దేవుడిపై భక్తి శ్రద్ధలతో నేనే కావాలని చిన్న పీటపై కూర్చుకున్నాను. నా మనస్సు నిండ ఉన్న పేదల ఇళ్ల కల నిజమైంది కాబట్టి, స్వామివారికి ప్రత్యేకం కృతజ్ఞతలు తెలిపేందుకు.. అలా కూర్చుకున్నాను.

కానీ దురదృష్టం ఆ ఫోటోను తీసుకుని చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ ఇది ఎవరో కావాల్సి చేసింది కాదు. అలానే నేను ఎవరికీ కూడా ఆత్మగౌరవం దెబ్బతినేలా పని చేయనను. మిత్రులు ఎవరైనా ఆ ఫోటో చూసి మనసుకు బాధ కలిగించి ఉంటే అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నారు. భవిష్యత్ లో కూడా మా సంకల్పం ఇలానే ఉంటుంది. మా ప్రభుత్వం సంపదను సృష్టించి, ఆ సంపదను పేద ప్రజల కోసం వినియోగిస్తాం. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో శ్రద్ధతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

సోమవారం యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి చిన్న పీటపై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. మరి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.