iDreamPost
android-app
ios-app

Singireddy Niranjan Reddy: మంత్రి నిరంజన్​ రెడ్డి కారుపై దాడి.. చెప్పులు, రాళ్లతో..!

  • Author singhj Updated - 04:38 PM, Sun - 3 December 23

మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు అటాక్ చేశారు. చెప్పులు, రాళ్లను విసిరారు.

మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు అటాక్ చేశారు. చెప్పులు, రాళ్లను విసిరారు.

  • Author singhj Updated - 04:38 PM, Sun - 3 December 23
Singireddy Niranjan Reddy: మంత్రి నిరంజన్​ రెడ్డి కారుపై దాడి.. చెప్పులు, రాళ్లతో..!

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మెజారిటీ సాధించిన ఆ పార్టీ.. మరిన్ని సీట్లు గెలుచుకునే దిశగా పరుగులు పెడుతోంది. నెగ్గుతారనే స్థానాలతో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా చాలా చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు మెజారిటీ సాధించడం విశేషం. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది. దీంతో హస్తం పార్టీ నాయకులు, శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. పాతాళంలో ఉన్న పార్టీ కొన్ని నెలల వ్యవధిలోనే అద్భుతంగా పుంజుకొని విజయం సాధించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

కాంగ్రెస్ గెలుపుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి లాంటి సీనియర్ల పాత్ర ఎంతగానో ఉంది. ఈ ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి అంతా తానై ముందుండి నడిపించారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసారి పవర్​లోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అంటూ ముందు నుంచి కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపారు. దీంతో వాళ్లు పార్టీ విజయం కోసం మరింతగా శ్రమించారు. ఇక, ఈ ఎన్నికల్లో గెలుస్తారనుకున్న చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

వనపర్తి బీఆర్ఎస్ క్యాండిడేట్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి కూడా కాంగ్రెస్ హవా నడుస్తుండటంతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన తన కారులో వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు మంత్రి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిరంజన్ రెడ్డి మీద అటాక్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న మంత్రి నిరంజన్ మీద జరిగిన దాడిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కామారెడ్డిలో కమలం సత్తా.. రేవంత్ రెడ్డి, KCRని ఓడించి సంచలనం!