Telangana: గర్భిణి మహిళ నరకయాతన.. డాక్టర్‌గా మారి ప్రసవం చేసిన కాంగ్రెస్‌ MLA

ప్రసవవేదనతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు.. డెలివరీ చేసి.. తల్లి, బిడ్డలను కాపాడి వార్తల్లో నిలిచారు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు. ఆ వివరాలు..

ప్రసవవేదనతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు.. డెలివరీ చేసి.. తల్లి, బిడ్డలను కాపాడి వార్తల్లో నిలిచారు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు. ఆ వివరాలు..

ఆమెకు నెలలు నిండి.. ప్రసవవేదనతో బాధపడుతుంది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. డెలవరీ కోసం ఆ మహిళను తమ ఊరికి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఇక్కడ కష్టమని.. పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. ఇటు చూస్తేనేమో నొప్పులతో ఆమహిళ బాధ పడుతుంది.. డాక్టర్లేమో తమ వల్ల కాదంటున్నారు.. దాంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్దామంటే తమ దగ్గర అంత డబ్బు లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో వెంటనే తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఫోన్‌ చేసి సాయం కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే డాక్టర్‌గా మారి.. సదరు మహిళకు ప్రసవం చేశారు. ఆ వివరాలు..

ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ప్రసన్న అనే గర్భిణికి నెలలు నిండాయి.  దాంతో పురిటి నొప్పులు రావటంతో ఆమె కుటుంబసభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లగానే వైద్యులు ఆమెకు స్కానింగ్‌ చేశారు. దాంతో ప్రసన్న గర్భంలోని శిశువు పేగు మెడకు చుట్టుకుందని గమనించారు వైద్యులు. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ.. రిస్క్‌ పెరిగే శాతం ఎక్కువ ఉండటంతో.. ప్రసన్నకు ప్రసవం చేయడం తమ వల్ల కాదని.. ఆమెను జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు.

అందుకు వారి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అంతేకాక ఈ ఆస్పత్రి నుంచి ప్రసన్నను వేరే హస్పిటల్‌కి తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగుతుందేమో అని భయపడ్డారు. ఏం చేయాలో పాలుపోక.. ప్రసన్న కుటుంబసభ్యులు వెంటనే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

ఆ తర్వాత అచ్చంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కాల్‌ చేసి.. ప్రసన్నకు సిజేరియన్‌ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే వంశీ కృష్ణ. ఆ తర్వాత ఆయన వెంటనే అచ్చంపేట ఆసుపత్రికి చేరుకుని.. గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి ప్రసన్నకు సిజేరియన్‌ చేశారు. దాంతో ప్రసన్న పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అంతేకాక తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. ప్రభుత్వాసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల కోసం ఆస్పత్రికి వచ్చి డెలివరీ చేసిన ఎమ్మెల్యే మీద ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

Show comments