iDreamPost
android-app
ios-app

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జగజ్యోతికి 14 రోజుల రిమాండ్!

  • Published Feb 21, 2024 | 9:40 PM Updated Updated Feb 21, 2024 | 9:40 PM

Jaga Jyoti Remanded for 14 Days: ఇటీవల ప్రభుత్వ అధికారులు ఏసీబీకి వలలో చిక్కుతున్నారు. లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయింది.

Jaga Jyoti Remanded for 14 Days: ఇటీవల ప్రభుత్వ అధికారులు ఏసీబీకి వలలో చిక్కుతున్నారు. లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయింది.

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జగజ్యోతికి 14 రోజుల రిమాండ్!

ప్రభుత్వ కార్యాలకాల్లో ఏ పని జరగాలన్నా చేయి తడపనిదే పనులు కావని అంటుంటారు. ఓ వైపు ప్రభుత్వం లంచం తీసుకోవడం చట్టరిత్యా నేరం అని చెబుతున్నా.. ప్రభుత్వ శాఖలో ఏ పని కావాలన్నా పర్సంటేజీ ప్రకారం లంచం తీసుకోవడం సర్వసాధారణం అయ్యింది. కాంట్రాక్ట్ పనులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులు జరగాలంటే అధికారులకు లంచం ముట్ట చేప్పనిదే పనులు కావని బాధితులు ఆరోపిస్తున్నారు. పేద ప్రజలను పట్టి పీడిస్తున్న లంచావతారులను ఏసీబీ అధికారలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే..

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో బొడుగం గంగన్న అనే లైసెన్స్‌డ్ కాంట్రాక్టర్ నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణం పని, గాజుల రామారంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మించారు. దీనికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్ ను ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ కె జగజ్యోతి రూ.85 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయంచారు. సోమవారం హైదరాబాద్ లోని డీఎస్ఎస్ భవన్ లో జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. జగజ్యోతి ఇంటి నుంచి రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారలు తెలిపారు. అంతేకాదు కార్యాలయంలోని కొన్ని కీలక పత్రాలను స్వాధానం చేసుకున్నట్లు తెలిపారు.

జగజ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆమె చెస్ట్ పెయిన్ తో బాధపడటంతో వెంటనే ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రెండు రోజుల అనంతరం వివిధ టెస్టుల తర్వాత ఆమె ఆరోగ్యం బాగానే ఉందని బుధవారం నాడు ఉస్మానియా వైద్యలు డిశ్చార్జ్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో జ్యోతికి ఏసీపీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే.. జగజ్యోతి రిమాండ్ ని ఆపాలని ఆమె తరుపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే జగజ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిన కారణంగా కోర్టు అనుమతి తీసుకునే అరెస్ట్ చేశారని జడ్జీ తెలిపారు. మార్చి 6 వరకు రిమాండ్ లో ఉంచాలని ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.