Krishna Kowshik
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు 'ప్రగతి చక్రం' పురస్కారాల ప్రదానం చేసిన ఆయన
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు 'ప్రగతి చక్రం' పురస్కారాల ప్రదానం చేసిన ఆయన
Krishna Kowshik
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేపడుతుంది. తమది ప్రజా ప్రభుత్వంగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు వెల్లడించింది. ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు చెల్లించాల్సిన బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని హామీనిచ్చింది. ఈ మేరకు ముఖ్యమైన ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు ‘ప్రగతి చక్రం’ పురస్కారాల ప్రదానం చేసిన ఆయన ఈ మేరకు హామీనిచ్చారు. త్వరలోనే కార్మికులకు చెల్లించిన బకాయిలను వారి అకౌంట్లలోకి జమ చేస్తామన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఉన్నతోద్యోగి నుండి శ్రామిక్ వరకు మొత్తం 14 మందికి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ‘ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే సిబ్బంది ప్రధాన ధ్యేయం కావాలి. కొన్నేళ్లుగా కార్మికులకు చెల్లించాల్సిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) సొమ్ము, డీఏలు, పీఎఫ్ తదితర బకాయిలను త్వరలో చెల్లిస్తాం. పెండింగ్ బాండ్ల సొమ్ము రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాం. ఆర్టీసీలో కొత్తగా 3,035 నియామకాలను చేపట్టాం. రానున్న 5 సంవత్సరాల్లో కొత్త బస్సులను సైతం కొనుగోలు చేస్తున్నాం’అని వెల్లడించారు. ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండబోదని పేర్కొన్నారు.
రెండోసారి ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పొన్నం వెల్లడించారు. ఆర్టీసీకి ఉద్యోగానికి గుండె కాయ లాంటివారని, ప్రభుత్వం మీకు సహకరిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి, చెడు రెండు స్వీకరించాల్సి ఉంటుందని, పని ఒత్తిడి పెరిగి ఉండవచ్చునని, ప్రయాణికులు వస్తున్నారు కాబట్టే మన పని ఒత్తిడి పెరిగిందన్నారు. ప్రయాణికుల పట్ల మరింత క్రమశిక్షణగా ఉండాలని హితవు పలికారు. ఆర్టీసీలో ఉద్యోగి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.కోటి రూపాయల ప్రమాద బీమా ఇచ్చేలా ఎంవోయూ జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానన్నారు. వీజీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టామని, 259 రోజుల్లో 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. గతంలో టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.