వీడియో: శుభకార్యంలో భారీగా డబ్బులు డిమాండ్ చేసిన హిజ్రాలు! ఇంటికి వచ్చి రచ్చ…

చాలా మంది హిజ్రాలు ఆత్మగౌరవంతో ఆయా రంగాల్లో కష్టపపడి రాణిస్తుంటే..కొందరు మాత్రం జనాలను డబ్బులు డిమాండ్ చేస్తూ దౌర్యన్యాలు చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు.. అక్కడికి గ్రూపులుగా వచ్చి అప్పు ఉన్నట్టుగా వేలకు వేలు డిమాండ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తుంటారు.

చాలా మంది హిజ్రాలు ఆత్మగౌరవంతో ఆయా రంగాల్లో కష్టపపడి రాణిస్తుంటే..కొందరు మాత్రం జనాలను డబ్బులు డిమాండ్ చేస్తూ దౌర్యన్యాలు చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు.. అక్కడికి గ్రూపులుగా వచ్చి అప్పు ఉన్నట్టుగా వేలకు వేలు డిమాండ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తుంటారు.

నేటి సమాజంలో థర్డ్ జెండర్ పై ఉండే వివక్షత మెల్ల మెల్లగా పోతోంది. వాళ్లును మనలో ఒకరిగా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అలానే వారు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. డాక్టర్లు, యాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా మంచి ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. ఇలా చాలా మంది పలు రంగాల్లో కష్టపడి రాణిస్తుంటే.. మరోవైపు కొందరు హిజ్రాలు మాత్రం రెచ్చిపోయి ప్రవర్తించి..వారికి అపకీర్తి తెస్తున్నారు. రైళ్లలో, రద్దీ ప్రాంతాల్లో, శుభకార్యాల్లో వారు చేసే రచ్చ అంతఇంతాకాదు. తాజాగా శుభకార్యం జరుగుతున్న ఇంటికి వెళ్లిన హిజ్రాలు రచ్చ రచ్చ చేశారు. వారు చేసిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా హిజ్రాలు ట్రైన్లు, రోడ్ల మీద డబ్బులు అడగటం చేస్తుంటారు. కొందరు హిజ్రాలు అయితే ఇచ్చినంత తీసుకుని వెళ్తుంటే మరికొందరు మాత్రం డిమాండ్ చేస్తుంటారు. ముఖ్యంగా శుభకార్యాల్లో వారు చేసి రచ్చ మాములుగా ఉండదు. హైదరాబాద్‌లో ఎక్కడైనా శుభకార్యం చేయాలంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి వచ్చిందంటే వారు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చూసినట్లు అయేత.. భాగ్యనగరంలోని ఓ ప్రాంతంలోని ఓఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ ఇంటికి ముగ్గరు హిజ్రాలు వచ్చి నానా హంగామా సృష్టించారు.  తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ఇంటి వాళ్లు ఏదో కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వబోతుంటే ఏకంగా.. 25 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని సమాచారం. ఎంతో కొంత తీసుకోవాలంటూ ఆ కుటుంబ సభ్యులు బతిమాలుతుంటే.. వాళ్లు మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందేంటూ పట్టుబట్టారు. ఏదో అప్పు తీసుకున్న వారిని అడుగుతున్నట్లు గట్టిగా డిమాండ్ చేయటం అక్కడి వారిని షాక్ కి గురి చేసింది. పెళ్లికి వచ్చిన బంధువుల ముందు కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడుతూ.. హంగామా సృష్టించారు.

హిజ్రాలు చేసిన ఈ వ్యవహారం అంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తన  కుటుంబ ఫంక్షన్‌లో హిజ్రాలు నానా రచ్చ చేశారని, వాళ్లకి తామేదో అప్పు ఉన్నట్టుగా 25 వేలు డిమాండ్ చేశారంటూ, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ..ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు బాధితుడు పెట్టిన పోస్టుకు నగర పోలీసులు స్పందించారు. ఆ ఘటన జరిగిన ప్రాంత వివరాలు ఇవ్వాలని, ఈ తరహా ఘటనలు జరిగినప్పడు వెంటనే 100 కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు. మొత్తంగా ఈ మధ్య కొందరు హిజ్రాలు చేస్తున్న రచ్చ ప్రజలను ఆందోళనకు,  ఆవేశానికి గురి చేస్తుంది.

Show comments