Uppula Naresh
Uppula Naresh
బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ అనే యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉన్నాడు. ఇదే సమయంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రుట్ మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎలాగైన ఈ సారి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని ప్రవీణ్ ఎంతో కష్టపడి చదివాడు. ఇక ప్రిలిమ్స్ లో పాసై చివరికి ఈవెంట్స్ లోనూ సత్తా చాటాడు. ఇంతే కాకుండా మెయిన్స్ పరీక్షకు కూడా సన్నద్ధమై పరీక్షలు రాసి ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
కట్ చేస్తే.. TSLPRB బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో ప్రవీణ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. కానీ, ఈ విషయం తెలుసుకుని సంతోష పడటానికి ప్రవీణ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. కొడుకుకి ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలుసుకుని అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. కష్టపడి జాబ్ సంపాదించిన కొడుకు కళ్లముందు లేకపోవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇంతకు ప్రవీణ్ కు ఏం జరిగింది? అతను ఎలా చనిపోయాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లా టేకులపల్లి రాంపురం గ్రామం పరిధిలోని పాతతండాలో ప్రేమ్ కుమార్-పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడ ప్రవీణ్ (25) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రుట్ మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకుని ఎలాగైన కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే ప్రవీణ్ బాగా చదివి అన్ని పరీక్షల్లో పాస్ అయి చివరికి మెయిన్స్ పరీక్షలు కూడా రాశాడు. ఇక మరో రెండు నెలల్లో తుది ఫలితాలు విడుదల అవుతాయన్న క్రమంలోనే.. ప్రవీణ్ ఓ ప్రమాదంలో విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్త తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కట్ చేస్తే.. బుధవారం రాత్రి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రుట్ మెంట్ బోర్డ్ విడుదల చేసిన తుది ఫలితాల్లో ప్రవీణ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. కుమారుడి బతికి ఉంటే ఎంతో సంతోష పడేవాడని ఏడ్చిన ఆ దంపతుల తీరు స్థానికులను కంటతటి పెట్టించింది.