iDreamPost
android-app
ios-app

బాలుడి ప్రాణం తీసిన లాలీపాప్! అసలేం జరిగిందంటే?

  • Published Jul 12, 2023 | 5:47 PM Updated Updated Jul 12, 2023 | 5:47 PM
  • Published Jul 12, 2023 | 5:47 PMUpdated Jul 12, 2023 | 5:47 PM
బాలుడి ప్రాణం తీసిన లాలీపాప్! అసలేం జరిగిందంటే?

సరదాగా చేసే కొన్ని పొరపాట్ల వల్ల చూస్తుండగానే కొందరి ప్రాణాలు పోతుంటాయి. గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని, నాణెం ఇరుక్కుని ఇలా ఇప్పటికీ ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బాలుడు కూడా ప్రాణం కోల్పోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే? ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన లకావ త్ కృష్ణ-సునీత దంపతులు. బతుకు దెరువు కోసం వీళ్లు గతంలో హైదరాబాద్ కు వచ్చి ఈసీఎల్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారుల సంతానం.

ఇదిలా ఉంటే.. పెద్ద కుమారుడైన గౌతమ్ (10) సోమవారం ఎప్పటి లాగే స్కూల్ కు వెళ్లాడు. ఇక స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారి ఇంటి సమీపంలో ఉన్న ఓ కిరాణ దుకాణంలో లాలీపాప్ కొన్నాడు. దానిని సరదాగా తినే క్రమంలోనే అది ఆ బాలుడి గొంతులో ఇరుక్కుంది. ఈ క్రమంలోనే ఆ చిన్నారి పూర్తిగా స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. దీంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet