iDreamPost
android-app
ios-app

పండగ వేళ విషాదం.. పతంగి ఎగుర వేస్తూ కరెంట్ షాక్‌తో..

సంక్రాంతి పండుగ వచ్చేసింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు కూడా సెలవులు పెట్టుకుని స్వంత ఊళ్లకు పయనమయ్యారు. ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇటు హైదరాబాద్ నగరంలో పతంగులు ఎగురుతున్నాయి. అయితే..

సంక్రాంతి పండుగ వచ్చేసింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు కూడా సెలవులు పెట్టుకుని స్వంత ఊళ్లకు పయనమయ్యారు. ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇటు హైదరాబాద్ నగరంలో పతంగులు ఎగురుతున్నాయి. అయితే..

పండగ వేళ విషాదం.. పతంగి ఎగుర వేస్తూ కరెంట్ షాక్‌తో..

సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు మోసుకొచ్చే అంటూ పాటలు పాడుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లిన చాలా మంది ఇప్పటికే తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో పల్లెటూర్లలో పండగ వాతావరణం సంతరించుకుంది.  రంగ వల్లులుతో వాకిళ్లు, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇళ్లు కళకళలాడిపోతుంది. డూడూ బసవన్నలు, హరిదాసుల రాకపోకలు సాగిపోతున్నాయి. ఇక పిల్లలకు కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఆట పాటల్లో మునిగి తేలుతున్నారు. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రా ప్రాంతంలో ఒకలా, తెలంగాణలో కొన్ని నగరాల్లో మరోలా చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లో ఎక్కువగా పతంగుల పండుగగా జరుపుకుంటారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా గాలి పటాలు ఎగుర వేస్తుంటారు.

ఇప్పడు ఇదే సరదా.. ఓ పిల్లాడి ప్రాణం తీసి.. పండుగ వేళ ఆ ఇంట్లో విషాదం నింపింది. సంక్రాంతి సెలవులు కావడంతో తనిష్క్ అనే బాలుడు స్నేహితులతో కలిసి ఆట పాటల్లో మునిగి తేలాడు. సరదాగా గాలిపటాలు ఎగురవేసేందుకు వెళ్లి మృత్యవాత పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. అతడి వయస్సు 11 సంవత్సరాలు. పతంగులు ఎగురవేసేందుకు బిల్డింగ్ పైకి ఎక్కాడు తనిష్క్. అక్కడ పతంగులు ఎగురవేస్తూ కరెంట్ షాక్ తగిలి తనిష్క్ మృత్యువాత పడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే గాలిపటాలు ఎగరేసే సమయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని.. వాళ్లు ఆటల్లో మునిగిపోతుంటారని, అప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పలువురు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి