nagidream
ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నాయకులంతా ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు పెడుతున్నారు. అయితే రాజకీయ నాయకులు ప్రచార నిమిత్తం వెళ్లే ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు విధిస్తారు. ఈ క్రమంలో రేపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొరపాటున ఇటువైపు వెళ్తే అడ్డంగా బుక్కయిపోతారు.
ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నాయకులంతా ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు పెడుతున్నారు. అయితే రాజకీయ నాయకులు ప్రచార నిమిత్తం వెళ్లే ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు విధిస్తారు. ఈ క్రమంలో రేపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొరపాటున ఇటువైపు వెళ్తే అడ్డంగా బుక్కయిపోతారు.
nagidream
ముఖ్యమైన పండగలప్పుడు ఊరేగింపులు, యాత్రలు వంటివి జరిగినప్పుడు.. లేదా రాజకీయ నాయకుల ప్రచారం అప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడం మామూలే. పలానా రోడ్డు మార్గాల్లో రద్దీ ఉంటుంది. ఆ మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో వెళ్ళమని.. మరీ ముఖ్యంగా ఈ సమయాల్లో ఆ మార్గాల్లో రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తారు. అయితే ట్రాఫిక్ ఆంక్షలను పట్టించుకోకుండా ఆ సమయంలో ఆ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు. నిమిషాల్లో చేరుకోవాల్సిన డెస్టినేషన్ ని కూడా గంటలు గడిచినా సరే చేరుకోలేని పరిస్థితి కలుగుతుంది. అందుకే రేపు పొరపాటున కూడా ఈ మార్గాల్లో వెళ్ళకండి.
ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రతిపక్ష నేతలు విసిరిన ఛాలెంజ్ లు స్వీకరిస్తున్నారు. అసెంబ్లీయే ఎన్నికల్లో గెలిచినట్టే లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలిచి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ.. అలానే రేవంత్ రెడ్డి జోష్ మీద ఉన్నారు. ఇదే జోష్ తో రేపు ఆదివారం కూడా ఆయన శంషాబాద్ లో ప్రచారం చేయనున్నారు. మే 5న ఆదివారం నాడు శంషాబాద్ బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్.. అలానే రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
5వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు, ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి ఆరాంఘర్ మీదుగా ఎయిర్ పోర్టుకి వెళ్ళేవాళ్ళు శంషాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఎయిర్ పోర్టు నుంచి ఆరాంఘర్ వైపు వెళ్ళే వాళ్ళు శంషాబాద్ ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్ళాలని అన్నారు. అయితే శంషాబాద్ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుని మాత్రం వాడకూడదని అన్నారు.
మహబూబ్ నగర్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్ళేవాళ్ళు కూడా శంషాబాద్ ఫ్లై ఓవర్ మీద నుంచే వెళ్లాలని.. అయితే ఫ్లై ఓవర్ పక్కనున్న సర్వీస్ రోడ్డుని వాడకూడదని పోలీసులు తెలిపారు. ఇక మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కి, ఇతర ప్రాంతాలకు వచ్చే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్లాలని తెలిపారు. అలానే షాబాద్ నుంచి హైదరాబాద్ కి, ఇతర ప్రాంతాలకు వచ్చే వాళ్ళు కూడా అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుని వాడుకోవాలని సూచించారు. పొరపాటున శంషాబాద్ బస్టాండ్ వైపు వెళ్తే ఇరుక్కుపోతారు. అది కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో వెళ్తే ఇక అంతే. కాబట్టి రేపు ఒక్కరోజు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.