నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

Weather Update: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు  ప్రవేశించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆ జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.

Weather Update: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు  ప్రవేశించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆ జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.

గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అదిరిపోయే ఎండలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవన ప్రవేశించిన తరువాత వాతావరణంలో మార్పులు వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వాతావరణం మేఘవృతమై ఉంది. అలానే తరచూ తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ సమాచారం ఒకటి వచ్చింది. నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో భారీ వానాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు  ప్రవేశించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన వానలకు రైతులు బాగా నష్టపోయారు. అలానే పలు ప్రాంతాల్లో పిడుగులు పడి కొందరు మరణించారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. శని, ఆదివారాల్లో అంటే నేడు, రేపు తెలంగాణలో భారీ వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం కాలంలో లోపు పలు ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అంతేకాక చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచానా వేసింది. శనివారం పెద్దపల్లి జిల్లా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, , నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ వానలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక అలానే ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్ జిల్లాలతో పాటు చుట్టు పక్కల ఉన్న మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉంది. అలానే నిజమాబాద్ ,  జగిత్యాల, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిపాటి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Show comments