వీడియో: కళ్యాణంలో తీవ్ర విషాదం.. అందరూ చూస్తుండగానే..

ఈ మద్య మనిషికి మృత్యువు ఎలా వస్తుందో ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో ఆనందంగా, సంతోషంగా ఉన్నవాళ్లు హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల కంటికి కనిపించకుండా దూరమవుతున్నారు.

ఈ మద్య మనిషికి మృత్యువు ఎలా వస్తుందో ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో ఆనందంగా, సంతోషంగా ఉన్నవాళ్లు హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల కంటికి కనిపించకుండా దూరమవుతున్నారు.

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలు, హార్ట్ ఎటాక్, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు. తెలంగాణలో అరుదైన ప్రాచీన జానపద కళల్లో ఒకటి ఒగ్గు కథ. తెలంగాణలో ఇప్పటికీ పలు గ్రామాల్లో ఒగ్గు కథలు ప్రత్యేకంగా చెప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో ఎల్లమ్మ కల్యాణం జరిపిస్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఒగ్గు కథ కళాకారుడు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎల్లమ్మ కల్యాణం జరిపించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఒగ్గు కథా కళాకారుడైన శివ కుమార్ కళాబృందాన్ని పిలిపించారు. మంగళవారం మధ్యాహ్నం శివకుమార్ (28) తన బృందంతో ఒగ్గు కథ చెబుతున్నారు. అందరూ సంతోషంగా తిలకిస్తున్నారు. అంతలోనే శివకుమార్ పట్టుకున్న మైక్ కి హఠాత్తుగా కరెంట్ షాక్ తగిలింది. అంతే ఒక్కసారిగా శివ కుమార్ కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు శివ కుమార్ ని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

శివకుమార్ ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఓ వృద్దుడికి గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడ్డ శివకుమార్ అక్కడే కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఎల్లమ్మ కల్యాణం జరిపించేందుకు వచ్చిన శివకుమార్ కన్నుమూయడంతో గ్రామంలో ఒక్కసారే విషాదం నెలకొంది. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కరెంట్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలని… ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పోలీసులు అంటున్నారు.

Show comments