iDreamPost

తీవ్ర విషాదం: చిన్న పొరపాటుతో.. ముగ్గురు పిల్లలు, భార్య మృతి!

చాలా మంది సంతోషంగా సాగిపోయే జీవనం కావాలని కోరుకుంటారు. అలానే ఎక్కువ మందికి జరుగుతుంది. కానీ కొందరి విషయాల్లో మాత్రం విధి వింతనాటకం ఆడి.. సంతోషంగా ఉండే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి ఘోరమే ఓ కుటుంబంలో చోటుచేసుకుంది.

చాలా మంది సంతోషంగా సాగిపోయే జీవనం కావాలని కోరుకుంటారు. అలానే ఎక్కువ మందికి జరుగుతుంది. కానీ కొందరి విషయాల్లో మాత్రం విధి వింతనాటకం ఆడి.. సంతోషంగా ఉండే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి ఘోరమే ఓ కుటుంబంలో చోటుచేసుకుంది.

తీవ్ర విషాదం: చిన్న పొరపాటుతో.. ముగ్గురు పిల్లలు, భార్య మృతి!

ప్రతి ఒక్కరు తమ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే దంపతులు ఇద్దరు పనులు చేస్తూ.. కుటుంబాన్నినడుపుతుంటారు. అలానే ఓ జంట కూడ ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది. ఇక పిల్లల భవిష్యత్ గురించి ఎంతో ఆలోచిస్తూ, వారి కోసం కష్టపడుతున్నారు. అయితే అలా హాయిగా సాగిపోతున్న జీవితాల్లో ఓ రాత్రి విషాదం మిగిల్చింది. ఏకంగా కుటుంబంలోని నలుగురిని బలి తీసుకుని కాలరాత్రిని మిగిల్చింది. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్‌, పద్మ(26) దంపతులు. ఇక అతడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మట్టితో నిర్మించిన రెండు గదుల ఇంట్లో భాస్కర్ కుటుంబం ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు తేజస్విని(7), వసంత(5), కుమారుడు రిత్విక్‌ (10 నెలలు)లతో పాటు భాస్కర్‌ తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మలు కూడా ఈ దంపతులతో పాటే నివాసం ఉంటున్నారు. ఇక చక్కటి కుటుంబంతో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. వీరి చక్కనైన కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. అందుకే…వారిపై కన్నెర్ర చేసింది. దీంతో ఆదివారం వారిలోని కొందరికి చివరి రోజుగా మారింది.

రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా అందరూ భోజనాలు చేశారు.  అనంతరం పడుకోవడానికి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. ఇంటి ముందు భాగంలో ఉన్న రేకుల వరండాలో భాస్కర్‌ తల్లిదండ్రులు పడుకున్నారు. అలానే మట్టి కప్పు ఉన్న గదిలో భాస్కర్ దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు పడుకున్నారు. ఇక అదే సమయంలో గంటపాటు వర్షం భారీగా కురిసింది. దీంతో ఇంటి గోడలు, పైకప్పు పూర్తిగా తడిశాయి. అప్పటికే ఆ ఇంటి దూలం చెదలు పట్టి ఉండటంతో ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో దానిపైన ఉన్న మట్టి పైకప్పు అకస్మాత్తుగా కూలి.. గదిలో నిద్రిస్తున్న భాస్కర్‌ దంపతులతో పాటు ముగ్గురు పిల్లలపై పడింది.

భారీ శబ్దం రావడంతో భాస్కర్ తల్లిదండ్రులు  గట్టిగా కేకలు వేయశారు. దీంతో వెంటనే చుట్టుపక్కలవారు వచ్చి.. మట్టిని తొలగించి భాస్కర్‌ను కాపాడారు. అయితే మట్టి తొలగించేలోపే భాస్కర్ భార్య పద్మ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన భాస్కర్‌ను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబాన్ని ఆర్థిక సాయం ప్రకటించాడు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు.

మూడు రోజుల క్రితమే దూలానికి చెదలు పట్టిన విషయం గుర్తించిన భాస్కర్ సరి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే  దూలంకి సపోర్టుగా పెట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టారు. ఇక రెండు రోజుల్లో వాటిని ఇంకా అమర్చాలని అనుకున్నారు. ఇంతలోనే ఘోరం జరిగింది. కనీసం కర్రలను దూలానికి ఆధారంగా పెట్టి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్థులు తెలిపారు. మొత్తంగా ఒక్కేకుటుంబంలో నలుగురు మృతితో ఆ గ్రామంలో విషాధ ఛాయాలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి