శునకానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెలు! కారణం తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!

శునకానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెలు! కారణం తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!

ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. అమ్మాయిలు తమ సోదరులకు రాఖీ కట్టి..తమ ప్రేమను చాటుకుంటారు. అలానే ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నానంటూ సోదరులు వారి సోదరీమణులకు భరోసా ఇస్తుంటారు. తాజాగా ఓఘటన అందరికీ కన్నీరు తెప్పిస్తున్నాయి.

ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. అమ్మాయిలు తమ సోదరులకు రాఖీ కట్టి..తమ ప్రేమను చాటుకుంటారు. అలానే ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నానంటూ సోదరులు వారి సోదరీమణులకు భరోసా ఇస్తుంటారు. తాజాగా ఓఘటన అందరికీ కన్నీరు తెప్పిస్తున్నాయి.

అన్నాచెల్లెల అనుబంధాన్నికి ప్రతీకగా రక్షాబంధన్ పండగను నిర్వహించుకుంటారు. ఏటా రాఖీ పౌర్ణమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. ఇక అమ్మాయిలు తమ సోదరులకు రాఖీ కట్టి..తమ ప్రేమను చాటుకుంటారు. అలానే ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నానంటూ సోదరులు వారి సోదరీమణులకు భరోసా ఇస్తుంటారు.  ఇలా అందరు తమ తోడబుట్టిన వారితో రాఖీ పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం కన్నీరు తెప్పిస్తాయి. తాజాగా ఇద్దరు అక్కాచెల్లెల్లు ఓ శునకాన్ని తమ సోదరుడిగా భావించి రాఖీ కట్టారు. అయితే అలా వారు ఎందుకు చేశారో తెలిస్తే మాత్రం కంటి నుంచి కన్నీరు రాక మానదు. ఇంతకీ ఈ అక్కాచెల్లెల రాఖీ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం….

తెలంగాణ రాష్ట్రం  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో మర్రిపెల్లి మల్లయ్య-కమల దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి  20 ఏళ్ల క్రితం  చాలా ఏళ్ల పాటు పిల్లలు పుట్టలేదు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక పిల్లలు లేకపోవడంతో ఈ దంపతులు ఓ కుక్కను తెచ్చి రాము అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. అలా ఆ రామును తెచ్చుకుని పెంచుకుంటున్న సమయంలో కొంతకాలానికి వారికి ఆడపిల్లలు జన్మించారు. ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో మల్లయ్య దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిద్దరికి రమ్య, రమ అని పేరు పెట్టారు.

ఇక ఆ రాము, రమ, రమ్యలతో కలిసి మల్లయ్య కుటుంబం సంతోషంగా సాగిస్తున్నారు. అలా హాయిగా సాగుతున్న వారి కుటుంబంలో ఓ విషాదం చోటుచేసుకుంది. రమ, రమ్య పుట్టిన కొంతకాలం తరువాత రాము చనిపోయాడు. దీంతో తమ  ఇంట్లో మనిషిగా భావించే శునకం చనిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారు. ఇదే సమయంలో ఆ శునకంపై ప్రేమతో తమ పొలంలో దానికి సమాధి కట్టారు. రమ, రమ్యాలు ఆ శునకాన్ని అన్నలాగా భావించే వారు. అందుకే ఏటా రాఖీ పౌర్ణమి రోజున పొలం వద్దకు వెళ్లి కుక్క ఉన్న సమాదికి పూజలు చేస్తారు. అంతేకాక ఆ సమాధికి రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఇలా ఏటా చేసినట్లుగానే ఈ ఏడాది కూడా ఆ ఇద్దరు  అక్కాచెల్లెలు.. ఆ శునకానికి రాఖీ కట్టి తమ అభిమానం చూపించారు. మరి..ఈ ఎమోషనల్ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments