iDreamPost
android-app
ios-app

దుబాయ్‌లో భర్త.. పెళ్లైన ఏడాదిన్నరకే భార్య మృతి! ఏం జరిగిందంటే..

ప్రతి అమ్మాయి తమకు నచ్చినట్లు ఉండే భాగస్వామి దొరకాలని కోరుకుంటుంది. అలానే తమ ఆశలను నిజం చేసుకుంటూ చాలా మంది యువతులు సంసార జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే కొందరి విషయాల్లో మాత్రం విధి చిన్నచూపు చూస్తుంది.

ప్రతి అమ్మాయి తమకు నచ్చినట్లు ఉండే భాగస్వామి దొరకాలని కోరుకుంటుంది. అలానే తమ ఆశలను నిజం చేసుకుంటూ చాలా మంది యువతులు సంసార జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే కొందరి విషయాల్లో మాత్రం విధి చిన్నచూపు చూస్తుంది.

దుబాయ్‌లో భర్త..  పెళ్లైన ఏడాదిన్నరకే భార్య మృతి! ఏం జరిగిందంటే..

అమ్మాయిలు తమ జీవితంపై ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఎన్నో ఊహించుకుంటారు. తమకు నచ్చినట్లు ఉండే భాగస్వామి దొరకాలని కోరుకుంటారు. అలానే తమ ఆశలను నిజం చేసుకుంటూ చాలా మంది యువతులు సంసార జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే కొందరి విషయాల్లో మాత్రం విధి చిన్నచూపు చూస్తుంది. అలానే ఓ వివాహిత కూడా సంసార జీవితంలో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ..కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు..

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్ ఐశ్వర్య(20)కు మృతి చెందింది. ఆమెను గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ, విజయ దంపతుల కుమారుడు హరీశ్ కి ఇచ్చి ఏడాదిన్నర క్రితం పెద్దలు వివాహం చేశారు. ఇక తమ బిడ్డకు ఎంతో ఘనంగా పెళ్లి చేశామని సంతోషంలో ఝాన్సీ తల్లిదండ్రులు ఉన్నారు. వీరి ఆనందాన్ని రెట్టింపు అయ్యే ఒకటి వచ్చింది.  ఝాన్సీ గర్భం దాల్చడంతో ఇరు కుటుంబాల సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. మరికొద్ది నెలలలో తమ ఇంట బుజ్జాయి రాబోతుందని సంబరపడిపోయారు. ప్రస్తుతం ఝాన్సీ ఏడు నెలల గర్భణీ. ఆమె భర్త హరీశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఇలాంటి సమయంలో వీరికి ఓ కష్టం వచ్చిపడింది. గర్భిణీగా ఉన్న ఝాన్సీ అనారోగ్యానికి గురైంది.

నెల రోజులుగా ఝాన్సీకి వైద్యం చేయిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషయంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఝాన్సీ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ ఇలా విగతజీవిగా మారడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. ఎంతో జీవితం చూడాల్సిన తమ బిడ్డ ఇలా అర్ధాతరంగా తనువు చాలించడంతో మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో గర్భిణీలు మరణిస్తున్నారు. ఇలా విధి ఆడే వింతనాటకంతో ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం, అనారోగ్య సమస్యలతో చాలా మంది మహిళలు ఇలా పెళ్లైన కొత్తలోనే మరణిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.