అలా హెచ్చరించడమే ఆ తండ్రి తప్పా? యువతి దారుణం..!

నేటికాలంలో తల్లిదండ్రులు పిల్లలను గట్టిగా అరిచేందుకు భయపడుతున్నారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. తాజాగా ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను షాకి గురి చేసింది.

నేటికాలంలో తల్లిదండ్రులు పిల్లలను గట్టిగా అరిచేందుకు భయపడుతున్నారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. తాజాగా ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను షాకి గురి చేసింది.

మానవ జీవితం అనేది ఎంతో అమూల్యమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మ లభిస్తుందని పెద్దలు అంటుంటారు. అందుకే ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ జీవితాన్ని  సంతోషంగా సాగించాలి. కానీ నేటికాలంలో చాలా మంది..తమకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే ఆందోళనకు గురవుతుంటారు. అంతేకాక ఇలాంటి సమస్యలకు చావే పరిష్కారంగా భావిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. విద్యార్థులు కూడా చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ తండ్రి చదువుకోమని చెప్పినందుకు ఇంటర్ విద్యార్థిని నిండు జీవితాన్ని బలి చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మరి..పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బాపిరాజు జీవనోపాధి నిమితం చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చారు. నగరంలోని నిజాంపేట్ ప్రాంతంలో ప్రగతి నగర్ లోని నివాసం ఉంటున్నాడు. అక్కడే సాయికీర్తి లే అవుట్ లోని ధర్మపురి దొరవారి అపార్టమెంట్ లో బాపి రాజు వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. బాపి రాజు కుటుంబంతో సహా అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కృష్ణవేణి(19) అనే కుమార్తె ఉంది. గతంలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఆ యువతి ఫైయిలైంది. గత రెండేళ్లుగా ఫెయిల్ అయిన సబ్జెక్టుల పరీక్షలు రాస్తుంది. ఇటీవలే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసింది.

కృష్ణవేణి కూడా ఈ పరీక్షలు రాసేందుకు సిద్దమైంది. ఈ నెల 15,18 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాపి రాజు.. ఆ యువతికి గట్టిగా హెచ్చరించాడు. ఈ సారైన బుద్ధిగా చదువుకుని పరీక్షల్లో పాస్ కావాలని సూచించాడు. తండ్రి అలా చెప్పడంతో మనస్తాపానికి గురైన కృష్ణనవేణి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుంటుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు భోరునా విలపించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేటికాలంలో కొందరి పిల్లల ప్రవర్తన చూసి.. వారి తల్లిదండ్రులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.  వారి భవిష్యత్ కోసం కాస్తా గట్టిగా అరిచిన చాలు..మనస్తాపంతో జీవితాన్ని ముగిస్తున్నారు.  అందుకే చాలా మంది పేరెంట్స్ పిల్లలపై కాస్త అరవడానికి కూడా సంకోచిస్తుంటారు. చాలా మంది పిల్లలు..టీవీ రిమోట్ ఇవ్వలేదని, ఫోన్ పట్టుకోనివ్వలేదని,  కొత్తబట్టలు కొనివ్వలేదని.. ఇలా అనేక చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కృష్ణవేణి లాగా ఎంతో మంది యువతీయువకులు ఆవేశంతో తమ నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. మరి.. ఇలాంటి ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments