డాక్టర్ సాహసంకి హ్యాట్సాప్.. 3 వాగులు దాటి వైద్యం!

Mulugu District: మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. వైద్యులను సంప్రదిస్తాము. అలానే వారు కూడా మంచి చికిత్స అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. అలానే తాజాగా ఓ వైద్యుడు వాగు దాడి వైద్యం అందించాడు. మరి.. ఆ వివరాలు..

Mulugu District: మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. వైద్యులను సంప్రదిస్తాము. అలానే వారు కూడా మంచి చికిత్స అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. అలానే తాజాగా ఓ వైద్యుడు వాగు దాడి వైద్యం అందించాడు. మరి.. ఆ వివరాలు..

ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువగా ప్రార్థించేది ఇద్దరినీనే ఇద్దరిని. ఒకరు దేవుళ్లను, రెండవది వైద్యులను. నిత్యం ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను వైద్యులు కాపాడుతుంటారు. అందుకే ఏదైనా అనారోగ్యానికి గురైతే.. కాపాడంటూ..వైద్యులనే వేడుకుంటారు. అలానే ఎంతో మంది డాక్టర్లు తమ వైద్య వృతికే వన్నెతెచ్చేలా సేవలు అందిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి..ప్రజల ప్రాణాలు కాపాడుతుంటారు. తాజాగా భారీ వరదలను సైతం లెక్కచేయకుండా..మూడు వాగులు దాటి మరీ వైద్యం అందించి.. ఓ డాక్టర్ ప్రశంసలు అందుకుంటున్నారు. మరి.. ఆ స్టోరీ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి.  చాలా గ్రామాలను నీరు చుట్టుముట్టింది. అలానే ములుగు జిల్లాలో కూడా కుండపోత వానాలు కురిశాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఇదే సమయంలో ఓ వైద్యుడు ప్రాణాలను సైతం లెక్కచెయకుండా వాగులను దాటి మరీ వెళ్లి వైద్య సేవలు అందించారు.  ములుగు జిల్లా వాజేడు మండలంలో డీఎంహెచ్ వోగా అల్లెం అప్పయ్య విధులు నిర్వహిస్తున్నాడు.

ములుగు జిల్లా వాజేడు మండలం  పెనుగోలు  గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు  డీఎంహెచ్ వో అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. వైద్యం అందించాలని భారీ వర్షం కురుస్తున్నా.. మూడు గుట్టలు ప్రమాదకరమైన మూడు వాగులను తాళ్ల సాయంతో దాటారు. అలా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి అపశయ్య చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఇలా వాగులు వంకలు దాటుతూ ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వైద్య శిబిరం నిర్వహించి.. బుధవారం ఉదయం తిరిగి మండల కేంద్రానికి చేరుకున్నారు. అప్పయ్య వైద్య సిబ్బందితో కలిసి వెళ్లారు. గుమ్మడి దొడ్డి గ్రామం నుంచి 3 వాగులు దాటి.. అనంతరం మూడు  గుట్టలు ఎక్కి  16 కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. అలా అంత భారీ వర్షంలో కూడా వెళ్లి వైద్యం చేయడంపై స్థానికులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. వాగు దాటి వైద్యం అందించిన ఈ డాక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments