iDreamPost
android-app
ios-app

హ్యాట్సాఫ్.. తాను ఆరిపోతూ.. ముగ్గురి జీవితాల్లో వెలుగులు!

  • Published Mar 16, 2024 | 10:39 AM Updated Updated Mar 16, 2024 | 10:39 AM

Nalgonda Crime News: మనిషికి మళ్లీ జన్మ ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఈ జన్మలో తాము చనిపోయినా పది మందికి ఉపయోగపడాలనే తాపత్రయంతో ఉంటారు.

Nalgonda Crime News: మనిషికి మళ్లీ జన్మ ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఈ జన్మలో తాము చనిపోయినా పది మందికి ఉపయోగపడాలనే తాపత్రయంతో ఉంటారు.

  • Published Mar 16, 2024 | 10:39 AMUpdated Mar 16, 2024 | 10:39 AM
హ్యాట్సాఫ్.. తాను ఆరిపోతూ.. ముగ్గురి జీవితాల్లో వెలుగులు!

ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. మనిషి రోడ్డు పైకి వస్తే తిరిగి ఇంటికి వెళ్తారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం.. ఇలా డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన నిబంధనలు చేపట్టినా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా పెళ్లైన మూడు నెలలకే వివాహిత రోడ్డు ప్రమాదంతో కన్నుమూసింది. కానీ ఆమె చేసిన త్యాగంతో ముగ్గుర ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళితే..

నల్లగొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. హనుమాన్ నగర్ కి చెందిన పిట్లో మహేశ్వరి (24) ఎంబీఏ లో గోల్డ్ మెడల్ సాధించింది. వృత్తి రిత్యా చార్డర్డ్ అకౌంట్. మూడు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకుంది. భావి జీవితం గురించి బంగారు కలలు కన్నది. కానీ అవి కలగానే మిగిలిపోయాయి. మృత్యువు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ నెల 12న భర్త రాజేష్ తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగటా అదుపుతప్పి కిందపడిపోయింది. వెంటనే ఆమెను హైదరాబాద్ మలక్ పేట యశోధ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలోనే మహేశ్వరికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ విషయం విన్న మహేశ్వరి భర్త రాజేష్ ఒక్కసారే కుప్పకూలాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు.. ఇంతలోనే విధి ఈ విధంగా ఆడుకుంటుందని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే బ్రెయిన్ డెడ్ విషయం గురించి తెలుసుకున్న జీవన్ దాన్ వైద్య బృందం మహేశ్వరి భర్త రాజేష్, కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అంత దుఖఃంలో ఉన్నా కూడా వారు మహేశ్వరి అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు రోగులకు అమర్చి వారి ప్రాణాలు కాపాడారు.