iDreamPost
android-app
ios-app

వారిది ప్రేమపెళ్లి.. కానీ ఆ భయంతో దారుణ నిర్ణయం!

వారిద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్‌ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు అడ్డు చెబుతారని భావించిన ప్రేమ జంట దారణ నిర్ణయం తీసుకుంది.

వారిద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్‌ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు అడ్డు చెబుతారని భావించిన ప్రేమ జంట దారణ నిర్ణయం తీసుకుంది.

వారిది ప్రేమపెళ్లి.. కానీ ఆ భయంతో దారుణ నిర్ణయం!

నేటికాలంలో ప్రేమ కారణంగా జరుగుతున్న దారుణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలు ఈ ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.  పరువు కోసం జరిగే హత్యలు కొన్ని అయితే, విడిపోయి ఉండలేక ప్రేమ జంటలు చేసుకునే ఆత్మహత్యలు మరికొన్ని. ఇలా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని వారి జీవితాలను కోల్పోవడం తో పాటు ఇరు కుటుంబాలకు గుండె కోతను మిగులుస్తున్నారు. తాజాగా ఓ  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కలవర పరిచింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన కావలి శ్రీకాంత్(24) కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయన షాద్‌నగర్‌లో ఓ కిరాణ షాపులో పని చేస్తున్నాడు. ఇదే సమయంలో అదే ప్రాంతంలోనే కిస్మత్‌పూర్‌ గ్రామానికి చెందిన మాధవి(16) అనే యువతితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. చాలా రోజుల పాటు వారి స్నేహం కొనసాగింది. చివరకు ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి..పెళ్లి వరకు వెళ్లింది. అయితే మాధవి మైనర్ కావడంతో పాటు ప్రేమ పెళ్లికి వారి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరు వీడిపోయి ఉండాలనే ఆలోచనే భరించలేక పోయారు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్, మాధవి గత నెల 27న యాదగిరిగుట్టకు వెళ్లి.. అక్కడ వివాహం చేసుకున్నారు.

పెళ్లి అనంతరం  శ్రీకాంత్, మాధవిలు స్వగ్రామానికి మార్చి30న వచ్చారు.  అదే సమయంలో కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తారన్నఆ నవదంపతులు భయ పడ్డారు. అలా మనస్తాపం చెందిన శ్రీకాంత్, మాధవి గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కి దగ్గర్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరిని స్థానికులు గమనించారు. వెంటనే శ్రీకాంత్, మాధవిలను షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు మార్చి 31 హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మాధవి మృతి చెందింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం శ్రీకాంత్‌  కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక ఈ ఘటనపై శ్రీకాంత్‌ తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో నిండు నూరెళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించారు. ఇలా నిత్యం ఎన్నో ప్రేమ జంటలు వివిధ కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నాయి. అంతేకాక వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నారు. తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతున్నారు.  మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.