Telangana Rail Alert: తెలంగాణను వదలని వానలు.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణను వదలని వానలు.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Telangana Rail Alert: తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు వానలు దంచికొట్టనున్నాయి.ఇప్పటికే కురిసిన వానలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. తాజాగా వాాతావరణ శాఖ మరో కీలక అలెర్జ్ జారీ చేసింది.

Telangana Rail Alert: తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు వానలు దంచికొట్టనున్నాయి.ఇప్పటికే కురిసిన వానలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. తాజాగా వాాతావరణ శాఖ మరో కీలక అలెర్జ్ జారీ చేసింది.

కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను సైతం ఈ వర్షాలు వదలడం లేదు.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే కురిసిన వానలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. పలు జలపాతాలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఇలా రోజూ కురుస్తున్న వానలకు జనాలు అల్లాడిపోతున్నారు. అయినా తెలంగాణ రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. నేడు కూడా రాష్ట్రంలోని ఆ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు వానలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో శుక్రవారం నుంచి రెండు రోజులు భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వానలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు అనగ శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇలానే గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఏండీ హైదరాబాద్ పేర్కొంది.

నేడు పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నందున ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ లో  వాతావరణం పొడిగా ఉంటుదని తెలిపింది. అయితే ఇక్కడ రానున్న రెండు రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉంది. నేడు హైదరాబాద్ లో ఉదయం మేఘాలు కమ్ముకున్నా.. సాయంత్రానికి వర్షం కురిసే  అవకాశం ఉంది. వర్షం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

ఇక ఎగువన కురుస్తున్న వానలకు నాగార్జునసాగర్ నిండుకుండాల దర్శనిమిస్తుంది. అలానే  అధికారులు దాదాపు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.ప్రస్తుతం సాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3.45 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌కు చేరుతుంది. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో దాదాపుగా సమానంగా ఉన్నాయిని అధికారులు తెలిపారు. నాగార్జున్ సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి దిగువకు దూకుతున్న కృష్ణమ్మను చూసేందుకు  చాలా మంది పర్యాటకులు వెళ్తున్నారు. దీంతో  నాగార్జున్ సాగర్ నుంచి నీరు ప్రకాశం బ్యారెజీకి వెళ్తున్నాయి.

Show comments