Arjun Suravaram
ప్రతి మనిషి..తన కుటుంబంతో సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు భర్త పిల్లల్తో హాయిగా జీవించాలని ఆశ పడుతుంటారు. అలానే ఓ వివాహిత ఎన్నో ఆశలతో ఉండగా.. అనుకోని విషాదం చోటుచేసుకుంది.
ప్రతి మనిషి..తన కుటుంబంతో సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు భర్త పిల్లల్తో హాయిగా జీవించాలని ఆశ పడుతుంటారు. అలానే ఓ వివాహిత ఎన్నో ఆశలతో ఉండగా.. అనుకోని విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రతి మహిళ తన జీవితం గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. ముఖ్యంగా పెళ్లి, సంసారం అనే విషయాల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక కొత్తగా పెళ్లైన మహిళలు అయితే ‘అమ్మా’ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటారు. అలానే ఏడు నెలల గర్భిణీ కూడా తన ఎప్పుడెప్పుడు బిడ్డకు జన్మనిస్తానా, అమ్మా అని పిలింపించుకుంటానా అనే ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆమె ఒకటి తలిస్తే విధి మరోలా చేసింది. అనారోగ్యానికి గురైన ఆ మహిళ మృతి చెందింది. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం బాదిగూడ గ్రామానికి చెందిన పెందూర్ విమలాబాయి(25)కు సిరికొండ మండలం పొన్న ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఇక ఆ దంపతులు ఎంతో అనోన్యంగా సంసారం జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఆ దంపతులకు ఓ గుడ్ న్యూస్ తెలిసింది. విమలాబాయి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ. ఇటీవలే విమలా ఇచ్చోడ మండలం బాదిగూడలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ మంగళవారం ఉదయం అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఇచ్చోడ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సు గర్భిణిని పరిశీలించి..సాధారణ నొప్పులే అని చికిత్స అందించారు. కాసేపటికి స్టాఫ్ నర్సు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రెండో ఏఎన్‌ఎం ఆమెకు వైద్య సేవలు అందించింది. ఇక మూడు గంటల తరువాత విమలాబాయి అక్క అమరావతి.. తన చెల్లికి కడుపు గట్టిపడిందని సిబ్బందికి చెప్పింది. ఆమెను పరీక్షించిన అక్కడి వారు ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. వెంటనే 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో ఆమెను తరలించారు. అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన కొద్ది సేపటికే ఆ గర్భిణీ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు గుండెల పగిలేలా రోధించారు. ఇదిలా ఉంటే ఇచ్చోడ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని విమలాబాయి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మనోహర్‌ను మీడియా వివరణ కోరగా.. ఆయన పలు విషయాలను వెల్లడించారు. విరేచనాలతో పాటు రక్తహీనతకు గురి కావడంతో బాధితురాలిని ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అక్కడ ప్రథమ చికిత్స అందించినా తరువాత రిమ్స్‌కు తరలించడంలో ఆలస్యం, రక్తహీనత కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికే తమ ఇంటికి మరికొద్ది రోజుల్లో సంతోషాన్ని తీసుకొస్తుందని భావిస్తున్న కుటుంబ సభ్యులకు..గర్భిణీ మరణం విషాదాన్ని నింపింది.