iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..కాలి బూడిదైనా సెల్ ఫోన్లు!

  • Published Aug 07, 2024 | 3:10 PM Updated Updated Aug 07, 2024 | 3:10 PM

Fire Accident In Hyderabad: తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా బుధవారం హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Fire Accident In Hyderabad: తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా బుధవారం హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

  • Published Aug 07, 2024 | 3:10 PMUpdated Aug 07, 2024 | 3:10 PM
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..కాలి బూడిదైనా సెల్ ఫోన్లు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి వివిధ కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులు సజీవహదహనం అవుతుంటారు. మరెందరో తీవ్రమైన గాయలతో జీవితాన్ని నరకం అనుభవిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు, కాలిబూడదయ్యాయి.

హైదరాబాద్ నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో సికింద్రాబాద్ లోని ఓ లాడ్జీలో, అలానే రాంగోపాల్ పేట లోని ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. తాజాగా కూకట్ పల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.   కెపీహెచ్ బీ ఫేజ్ 3లోని ఎల్ఐజీ భవనంలోని 16/11,12 ప్లాట్స్ లో  అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ రెండు ప్లాట్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షణ్ముఖ పవన్ అనే వ్యక్తి ఈ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. ఆ రెండు ప్లాట్స్ లో సెల్ ఫోన్లలను నిల్వ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాడు.

ఈ రోజు అనగా బుధవారం మధ్యాహ్నాం  సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో తొలుతా ఓ ప్లాట్ లో అగ్నిప్రమాదం సంభవించి.. ఒక్కసారిగా మంటలు వచ్చాయి.  ఆ మంటలు క్రమంగా పెరగడంతో రెండో ఫ్లాట్ కి వ్యాపించాయి.  మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్నపోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక చాలా సేపు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదంలో ఆ ఫ్లాట్స్ లో ఉన్న సెల్ ఫోన్లు వాటికి సంభందించిన బ్యాటరీలు అన్నీ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైనట్టు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదా ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని  పోలీసులు తెలిపారు. అయితే జనాలు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş