Arjun Suravaram
Jangaon: బెట్టింగ్ యాప్స్ కారణంగా నిక్షేపంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా జీవితాలను నిండా ముంచేస్తుంది. తాజాగా అలాంటి బెట్టింగ్ యాప్ కి ఓ కుటుంబం రోడ్డున పడిపోయింది.
Jangaon: బెట్టింగ్ యాప్స్ కారణంగా నిక్షేపంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా జీవితాలను నిండా ముంచేస్తుంది. తాజాగా అలాంటి బెట్టింగ్ యాప్ కి ఓ కుటుంబం రోడ్డున పడిపోయింది.
Arjun Suravaram
దేవరరాజు అనే వ్యక్తిది ఓ అందమైన కుటుంబం. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఎంతో సంతోషంగా ఆయన జీవితం సాగిపోతుంది. ఇలాంటి సమయంలోనే ఒక రాక్షసి చేరి.. అతడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చివరకు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధారంతరంగా ముగిసేలా చేసింది. ఆ రాక్షసినే బెట్టింగ్. దీని కారణంగా దేవరాజులాంటి కుటుంబాలు ఎన్నో చీకట్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రశాంతంగా ఉండే కుటుంబాలను ఈ మహామ్మారి నిండా ముంచేస్తుంది. తాజాగా బెట్టింగ్ కారణంగా తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే…
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవరాజు..ప్రభుత్వ ఉద్యోగి. రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అందరు సంతోషంగా జీవించే వాళ్లు. అయితే దేవరాజు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడ్డాడు. తరచూ ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టే వాడని సమాచారం. ఈక్రమంలోనే బెట్టింగ్స్ కారణంగా భారీగా డబ్బులను నష్టపోయాడు. దీంతో దేవరాజు తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఒక వైపు ఆర్థిక నష్టంతో, మరోవైపు అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో చాలా రోజుల పాటు మానసిక సంఘర్షనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే అప్పులు ఇచ్చిన వారు తిరిగి తీర్చేయమని ఒత్తిడులు చేయడంతో.. అప్పులు తీర్చే మార్గంలేక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం రఘునాథపల్లి రైల్వేస్టేషన్ లోనే.. ట్రైన్ కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక దేవరాజు మృతితో వారి కుటుంబ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. రైల్వే శాఖలో మంచి ఉద్యోగం.. అయినా ఇలా దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్, వీటికి బానిసగా మారడం వలన నిక్షేపంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా జీవితాలను భిన్నాభిన్నం చేస్తుంది. అందుకు ఊదాహరణే..దేవరాజు ఆత్మహత్య.
ఇలా చాలా మంది ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా అప్పులపాలై.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు బెట్టింగ్ అప్పులను తీర్చేందుకు తన కిడ్నీలు అమ్మేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతడిని కొందరు దారుణంగా మోసం చేశారు. 20 లక్షలు ఇస్తామని చెప్పి.. కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి..నిలువునా ముంచారు. ఇలా కేవలం బెట్టింగ్ అప్పులను తీర్చేందుకు యువకుడు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలానే బీటెక్ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎందరో జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.