iDreamPost
android-app
ios-app

ప్రియుడు పెట్టే ఆ వేధింపులకు తాళలేక యువతి దారుణ నిర్ణయం!

  • Published Jul 04, 2024 | 12:51 PM Updated Updated Jul 04, 2024 | 12:51 PM

Mahabubabad News: ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. అలానే ప్రేమోన్మాదానికి చాలా మంది యువతులు బలవుతున్నారు. తాజాగా ఈ మరో యువతి ప్రియుడు పెట్టే ఆ టార్చర్ తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది.

Mahabubabad News: ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. అలానే ప్రేమోన్మాదానికి చాలా మంది యువతులు బలవుతున్నారు. తాజాగా ఈ మరో యువతి ప్రియుడు పెట్టే ఆ టార్చర్ తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది.

  • Published Jul 04, 2024 | 12:51 PMUpdated Jul 04, 2024 | 12:51 PM
ప్రియుడు పెట్టే ఆ వేధింపులకు తాళలేక యువతి దారుణ నిర్ణయం!

నేటికాలంలో ప్రేమ పేరుతో జరిగే నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు యువతులకు మాయమాటలు చెప్పి..తమ బుట్టలో వేసుకుంటారు. కొంతకాలం గడిచిన తరువాత వారు చెప్పినట్లు వినకపోతే.. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో మోసపోయి కొందరు, ప్రేమ పేరుతో పెట్టే వేధింపులు తాళలేక మరికొందరు యువతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది యువతులు ప్రేమోన్మాదుల కారణంగా జీవితాన్ని కోల్పోయారు. తాజాగా మరో యువతి కూడా ప్రేమ  పేరుతో ఎదురైన వేధింపులకు తాళలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.  ఈఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మండలం డీఎస్‌ఆర్‌ జెండాలతండా పరిధిలోని ఆముదాలగడ్డ తండాలో బుధవారం యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆముదాలగడ్డ తండాకు చెందిన బాదావత్‌ అనూష (20) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె డిగ్రీ మధ్యలోనే ఆపివేసి ఇంటి వద్దనే ఉంటుంది. ఇదే సమయంలో అనుషా కుటుంబసభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్తుండే. ఇలా పొలం పనులకు వెళ్లే క్రమంలో  అదే తండాకు చెందిన భూక్యా సురేష్ తో పరిచయం ఏర్పడింది. చాలా కాలం పాటు స్నేహంగా ఉన్న వారి పరిచయం..కొన్నాళ్లకు ప్రేమగా మారింది. భూక్యా సురేష్ కి గతంలోనే పెళ్లైంది. అయినా అనూషతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

సురేష్‌కు భార్య పిల్లలు ఉన్నారు. దీంతో అతడితో అనూషకు పెళ్లి చేసేందు ఆమె కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు అంగీకరించలేదు. దీంతో ఆమె సురేష్ కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొంతకాలంగా సురేష్ అనూష్ ను తనతో కలిసి జీవించాలనే వేధిస్తున్నాడు. ఆమె ఎన్ని సార్లు అతడి నుంచి తప్పించుకున్న..తిరిగి వేధిస్తుండే వాడని స్థానికులు తెలిపారు. దీంతో కొన్ని రోజుల నుంచి అనూష తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని అనూష ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు..ఆమెను కిందకి దించారు. అయితే అప్పటికే అనూష మృతి చెందింది. ఇక ఈ ఘటనపై మృతురాలి తండ్రి కోట్యా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనను ప్రేమ పేరిట నమ్మించి భూక్యా సురేష్‌ మోసం చేశాడని, తన చావుకు సురేష్‌ కారణమని అనూష ఆత్మహత్యలేఖ రాసి ఉరివేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఏది ఏమైనా ప్రేమ వేధింపుల కారణంగా యువతికి నూరేళ్ల జీవితం ముగిసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో పట్టుపని పాతికేళ్లు నిండకముందే జీవితాన్ని ముగించింది. మరి.. ఇలాంటి విషాద ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet