iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాదే..అంతలోనే దంపతుల ఆత్మహత్య! అసలు ఏం జరిగిందంటే?

  • Published Jan 27, 2024 | 11:40 AM Updated Updated Jan 27, 2024 | 11:40 AM

సంసారం అనేది ఓ చందరగం అని మన పెద్దలు చెబుతుంటారు. ఇందులో సంతోషాలు, దుఃఖాలు అనేవి సహజం. అయితే నేటికాలంలో కొందరు భార్యాభర్తలు మరీ దారుణంగా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ దంపతుల విషయంలో చోటుచేసుకుంది.

సంసారం అనేది ఓ చందరగం అని మన పెద్దలు చెబుతుంటారు. ఇందులో సంతోషాలు, దుఃఖాలు అనేవి సహజం. అయితే నేటికాలంలో కొందరు భార్యాభర్తలు మరీ దారుణంగా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ దంపతుల విషయంలో చోటుచేసుకుంది.

  • Published Jan 27, 2024 | 11:40 AMUpdated Jan 27, 2024 | 11:40 AM
పెళ్లై ఏడాదే..అంతలోనే దంపతుల ఆత్మహత్య! అసలు ఏం జరిగిందంటే?

సంసారం అనేది ఓ అందమైన ప్రయాణం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాల్లో తోడునీడగా ఉంటూ హాయిగా ముందుకు సాగుతుండాలి. అలానే ఈ జర్నీలో అప్పుడప్పుడు చిన్న చిన్న కుదుపులు వస్తుంటాయి. అలాంటి వాటికి తట్టుకుని ధైర్యంగా నిలబడి.. సంసార బంధంలో భార్యాభర్తలు సంతోషంగా జీవించాలి. కానీ కొందరు మాత్రం చిన్న చిన్న గొడవలు లేక ఇతర అంశాలకు దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. వృద్ధ దంపతుల నుంచి కొత్తగా పెళ్లైన జంట వరకు చాలా మంది క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట కూడా అలాంటి దారుణ నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అదిలాబాద్ జిల్లాలో  ఓ జంటకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. శుక్రవారం భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్ చేసుకుంది. ఆమె చనిపోయిన నింద తనపై కి వస్తుందనే భయంతో భర్త  కూడా స్మశాన వాటిక వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో పెళ్లై ఏడాది కాక ముందే ఈ జంట జీవితం ముగిసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు  చూద్దాం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన విజయ్(24)కి మహారాష్ట్రకు చెందిన పల్లవి(22)తో  2023 మే నెలలో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ జంటను చూసి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా  వ్యక్తం చేశారు.

Couple's suicide

ఇక కొత్త దంపతలు కావడంతో అందరు తమ ఇళ్లకు ఆహ్వానిస్తున్నారు. ఇక కొత్త జంట కావడంతో తొలి సంక్రాంతి పండగను పుట్టింట్లో జరుపుకోవాలని పల్లవి భావించింది. దీంతో సంక్రాంతి పండగకు పల్లవి తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ అందరితో సంతోషంగా పొంగల్ వేడుకను జరుపుకుంది. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. ఇక పల్లవి కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి షాకింగ్ దృశ్యం కనిపించింది. కుటుంబ సభ్యులు తలుపు తీయగానే పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి కనిపించింది. దీంతో వెంటనే పల్లవిని రిమ్స్‌కు తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

ఇదే సమయంలో పల్లవి మృతికి సంబంధించి తనపై అపవాదు వస్తుందన్న భర్త విజయ్ భయపడ్డారు. ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న స్మశాన వాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పల్లవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాలు, దంపతలు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా పెళ్లై ఏడాది గడవక ముందే ఓ జంట నూరేళ్ల పంట మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio