iDreamPost
android-app
ios-app

వద్దు.. వద్దంటున్నా.. కూతురి కళ్ల ముందే!.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 09, 2024 | 11:04 AM Updated Updated Sep 09, 2024 | 11:04 AM

ఓ వివాహిత తన కూతురు ఎంత వారిస్తున్న వినకుండా.. ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతు చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. కనీసం ఊహకు అందని రీతిలో ఆ తల్లి చేసిన తప్పుకు ఆ చిన్నారి విలవిలలాడింది.

ఓ వివాహిత తన కూతురు ఎంత వారిస్తున్న వినకుండా.. ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతు చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. కనీసం ఊహకు అందని రీతిలో ఆ తల్లి చేసిన తప్పుకు ఆ చిన్నారి విలవిలలాడింది.

  • Published Sep 09, 2024 | 11:04 AMUpdated Sep 09, 2024 | 11:04 AM
వద్దు.. వద్దంటున్నా.. కూతురి కళ్ల ముందే!.. అసలు ఏం జరిగిందంటే?

సజావుగా సాగే పండంటి కాపురం.. అమ్మతాననికి గుర్తింపునిచ్చే చక్కటి ఆడబిడ్డ.. అంతా బాగానే ఉన్నా ఆ కుటుంబంలో ఆ ఒక్క పని అందరినీ అంధకారంలోకి నెట్టేసింది. తన ముద్దు ముద్దు మాటలతో.. ఎదురుగా తన అమ్మ ఏం చేస్తుందో అర్ధం కానీ పరిస్థితుల్లో  ఓ చిన్నారి మనసు విలవిలలాడింది. అమ్మా.. వద్దు వద్దు.. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్ధం కావడం లేదంటూ.. ఆ చిన్నారి తల్లిని ఎంత వారించిన ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. అప్పటికే తాను భయపడిన విధంగా జరగరాని నష్టం జరిగిపోయింది. అసలు ఊహకు కూడా అందని రీతిలో ఆ తల్లి చేసిన పనికి ఆ చిన్నారి బిక్కుబిక్కుమంటూ  రోదించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓ వివాహిత తన కూతురు ఎంత వారిస్తున్న వినకుండా.. ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అయితే ఆ సమయంలో కట్టుకున్న భర్త గుర్తుకుపోయినా సరే.. ఎదురుగా ఉన్న కన్న కూతురు గురించి కూడా  ఆలోచించకుండా ఆ మహిళ ఇంతటి ఘోరానికి పాల్పడటం అనేది చాలా బాధకరం. అయితే ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు పదేళ్ల క్రితం..  ఉపాధి కోసం  గోదావరిఖని విఠల్ నగరుకు  వలస వచ్చారు. అయితే అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. కాగా, వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. అయితే అంతా సహజావుగా ఉన్న ఈ కుటుంబంకు అదే నగరానికి చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబంతో.. ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

ఇక ఆ పరిచయంతో యూసుఫ్ తరచూ అంజయ్య, మాధవి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే మాధవి, యూసుఫ్ మధ్య స్నేహం ఫోన్లలో మాట్లాడుకునేంత వరకు సాగింది. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ, శనివారం అంజయ్య ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఇంతలోనే మాధవి (30) ఉదయం 10 గంటల సమయంలో యూసుఫ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరివేసుకుంది. కానీ, ఆ సమయంలో తన కూతురు ఏం చేస్తున్నావు అమ్మా నాకు భయం వేస్తుంది అని వారించిన మాధవి పట్టించుకోలేదని సమాచారం. అయితే మృతురాలి భర్త తన భార్య మరణం విషయంలో యూసుఫ్పై అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశఆడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై రమేశ్ దర్యాప్తు చేస్తున్నారు.